బుధవారం 03 మార్చి 2021
Jangaon - Jan 03, 2021 , 04:13:05

జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

  • స్థాయీ సంఘాల సమావేశాల్లో జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడి

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 2 : ప్రజాప్రతినిధులు, అధికారులు సహా అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. శనివారం జడ్పీ కార్యాలయంలో ఆయా స్థాయీ సంఘాల చైర్మన్ల హోదాలో జడ్పీటీసీ సభ్యుల అధ్యక్షతన జరిగిన స్టాండింగ్‌ (స్థాయి సంఘాలు) కమిటీల సమావేశాల్లో రానున్న మూడు నెలల్లో చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ ప్రగతి ప్రణాళికలు, పనుల ప్రతిపాదనలు, తీర్మానాలను ఆమోదించారు. చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ గిరిబోయిన భాగ్యమ్మ అధ్యక్షతన 1, 2, 3, 4, 7 స్టాండింగ్‌ కమిటీలు, తరిగొప్పుల జడ్పీటీసీ ముద్దసాని పద్మజారెడ్డి అధ్యక్షతన 5వ కమిటీ, స్టేషన్‌ఘన్‌పూర్‌ జడ్పీటీసీ మారపాక రవి అధ్యక్షతన జరిగిన 6వ స్థాయీ సంఘం సమావేశంలో పాలకుర్తి జడ్పీటీసీ  పుస్కూరి శ్రీనివాస్‌రావు, జనగామ జడ్పీటీసీ నిమ్మతి దీపిక, జఫర్‌గఢ్‌ జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, దేవరుప్పుల జడ్పీటీసీ పల్లా భార్గవి, కోఆప్షన్‌ సభ్యులు ఎండీ గౌస్‌, ఎండీ మదార్‌తోపాటు ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక, ఆర్ధిక, విద్య, వైద్యం, అభివృద్ధి పనులపై చర్చించి కార్యాచరణను ఖరారు చేశారు. 3వ స్థాయీ సంఘం సమావేశంలో రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం మణికంఠ, లింగాలఘనపురం జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి పాల్గొని వ్యవసాయం, అనుబంధ రంగాల సమస్యలు, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలు, మత్స్యశాఖ వంటి అంశాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 5వ స్థాయీ సంఘం సమావేశం తరిగొప్పుల జడ్పీటీసీ ముద్దసాని పద్మజారెడ్డి అధ్యక్షతన జరుగగా కొడకండ్ల జడ్పీటీసీ కేలోత్‌ సత్తెమ్మతో కలిసి మహిళా, శిశుసంక్షేమంపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. 6వ స్థాయీ సంఘ చైర్మన్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ జడ్పీటీసీ మారపాక రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్మెట జడ్పీటీసీ మాలోతు శ్రీనివాస్‌తో కలిసి సాంఘిక సంక్షేమంపై సంబంధిత అధికారులతో చర్చించారు. వసతి గృహాల నిర్వహణ, వార్డెన్ల పనితీరు, వివిధ సంక్షేమ గురుకులాలు, వాటి నిర్వహణ, కార్పొరేషన్‌ రుణాలు, మురికివాడల అభివృద్ధి వంటి అంశాలపై జిల్లా అధికారులతో కార్యాచరణ రూపొందించారు. ఈసందర్భంగా జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ సమావేశాలకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల సమగ్ర సమాచారంతో హాజరుకావాలని కోరారు. ప్రస్తుతం మిషన్‌ భగీరథ పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు తీసుకున్నామని, ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని చేరుకోవాలని, ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని కోరారు. మిషన్‌ కాకతీయ పనులు వివరాలు, పెండింగ్‌ పనులు, చెల్లించిన బిల్లులు, పెండింగ్‌ బిల్లుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించామని చైర్మన్‌ సంపత్‌రెడ్డి వివరించారు. సమావేశంలో కోఆప్షన్‌ సభ్యులు, జడ్పీ సీఈవో రమాదేవి, ఏవో వసంత, వివిధ ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జడ్పీ చైర్మన్‌ సహా జడ్పీటీసీ సభ్యులు, అధికారులు నూతన సంవత్సరం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు.

VIDEOS

logo