శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 03, 2021 , 04:09:10

సమస్యల పరిష్కారానికి పద్మశాలీలు ఐక్యంగా పోరాడాలి

సమస్యల పరిష్కారానికి పద్మశాలీలు ఐక్యంగా పోరాడాలి

జనగామ టౌన్‌, జనవరి 2 : సమస్యల పరిష్కారానికి పద్మశాలీలు ఐక్యంగా పోరాడాలని పోపా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు బైరు శ్రీనివాస్‌, గంజి శ్రీనివాస్‌ అన్నా రు. జనగామ పట్టణంలోని మా ర్కండేయ ఆలయంలో పోపా ప ట్టణ అధ్యక్షుడు బోగ రాందయాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అఖిల భారత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు ఏలే వెంకటనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యంగా ఉండాలనే ధ్యేయంతో రాష్ట్ర కమిటీని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీఎల్‌ఎన్‌ స్వామి, మంగళంపల్లి జనార్దన్‌, మచ్చ బాలనర్సయ్య, ఏల సురేశ్‌, గుమ్మడవల్లి సత్యనారాయణ, పిట్టల సతీశ్‌, చింతకింది నరేశ్‌, గుర్రం నాగరాజు, దొంతుల వెంకన్న, యాదగిరి, మంగళంపల్లి రాజు, మోహన కృష్ణ భార్గవ, నల్ల ఆంజనేయులు, బిట్ల శంకర్‌, నవీన్‌, కాముని వేణు, తౌటి రమేశ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo