సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jan 03, 2021 , 04:04:34

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌, జన వరి 2 : మండల కేంద్రంలోని ముదిరాజ్‌ కాలనీకి చెందిన బూర్ల కుమారస్వామి ఆనారో గ్యంతో మృతి చెందగా, శనివారం మాజీ సర్పంచ్‌ ఇల్లందుల ప్రతాప్‌ ఆధ్వ ర్యంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల నాయకుడు ఇల్లందుల నరేశ్‌ 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సింగపురం రమేశ్‌కుమార్‌, సింగపురం కమలాకర్‌, చట్ల రాజు, నీలం సుధాకర్‌, ఊరడి లింగం, జీపీ సిబ్బంది అప్పాల రవి తదితరులు పాల్గొన్నారు.   

విశ్వనాథపురంలో..

స్టేషన్‌ ఘన్‌పూర్‌ : మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన కమ్మం యాకయ్య(36) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ సభ్యులను సర్పంచ్‌ అనుమాల మల్లేశం పరామర్శించి రూ.3 వేలు ఆర్థిక సాయం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో ఉప సర్పంచ్‌ దాసి నర్సయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు పోలె మల్లయ్య, దాసి రాజయ్య, మొలుగూరి పెద్ద ఎల్లయ్య, చిలగాని మొగిళి పాల్గొన్నారు. 

VIDEOS

logo