బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 02, 2021 , 03:23:43

వీరుల స్ఫూర్తితో మనువాదంపై ఉద్యమించాలి

వీరుల స్ఫూర్తితో మనువాదంపై ఉద్యమించాలి

జనగామ చౌరస్తా, జనవరి 1 :  వీరుల చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మనువాదంపై బహుజనులంతా ఉద్యమించాలని తెలంగాణ విద్యావంతులు వేదిక జిల్లా అధ్యక్షుడు కోడం కుమార స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్‌ ఉమాపతి భవన్‌లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కన్నారపు శివశంకర్‌ అధ్యక్షతన భీమా కోరెగావ్‌ మహార్‌ వీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కోడం కుమార స్వామితోపాటు తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ అవిలయ్య హాజరయ్యారు. కోడం కుమార స్వామి మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరారు. సీహెచ్‌ అవిలయ్య మాట్లాడుతూ భీమా కోరెగావ్‌ మహార్‌ వీరుల 203 ఏళ్ల సంస్మరణ సభలను జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ రచయితల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నక్క సురేశ్‌, దళిత, బహుజన నాయకులు కన్నారపు పరశురాములు, బీఎస్పీ నాయకులు భూమిగారి రాజేందర్‌, జేమ్స్‌, తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్‌ యువజన సంఘం డివిజన్‌ అధ్యక్షుడు తుర్కపల్లి కుమార్‌, ఉపాధ్యక్షుడు కల్లెపు ప్రవీణ్‌ కుమార్‌, ఎర్ర సుశాంత్‌, బొడ్డు రమేశ్‌, కోమళ్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo