గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 02, 2021 , 03:22:04

రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌

జనగామ రూరల్‌, జనవరి 1 : రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌ అని పేర్కొంటూ మండలంలోని పెంబర్తిలో పలువురి ఇళ్ల ముందు ముగ్గులు వేశా రు. గ్రామానికి చెందిన చినబోయిన రేఖ తన ఇంటి ముందు ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాల పేర్లతో ముగ్గువేసి కేసీఆర్‌పై అభిమానం చాటుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రైతులకు రైతుబంధు పథకంలో నగదును బ్యాంకులో జమ చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తూ జై కేసీఆర్‌ అని నినాదాలతో ముగ్గులు వేశారు.

పాలకుర్తిలో..

పాలకుర్తి : నూతన సంవత్సర వేడుకలను మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి నుంచి పిల్లల నుంచి పెద్దల వరకూ కేకులు కట్‌ చేసి స్వీట్లు పంచి పెట్టారు. మరోవైపు మండల కేంద్రంలోని శాంతినగర్‌లో ఎస్సై గండ్రాతి సతీశ్‌, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం మహిళలు తమ ఇళ్లముందు రంగురంగుల ముగ్గులు వేసి ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.


VIDEOS

logo