శనివారం 06 మార్చి 2021
Jangaon - Jan 02, 2021 , 03:20:09

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజయ్య

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌/లింగాల ఘనపు రం, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ను స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు మొక్కను అందించి నూ తన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ధయాకర్‌రావును సైతం కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాలఘనపురం జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, నియోజకవర్గం కోఆర్డినేటర్లు శ్రీధర్‌రావు, ఎర్రంరెడ్డి రాంరెడ్డి, కొమురవెళ్లి ధేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo