శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 01, 2021 , 02:36:55

ఎంపీటీసీల ఫోరం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎర్రబెల్లి

ఎంపీటీసీల ఫోరం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎర్రబెల్లి

దేవరుప్పుల, డిసెంబర్‌ 31 : ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యం లో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఫోరం మండల అధ్యక్షురాలు గొడుగు సుజాత నేతృత్వంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించగా, మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేపట్టిన అభివృద్ధి పనులను ఇందులో పొందుపర్చారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి కట్‌ చేసి ఎంపీటీసీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, జడ్పీటీసీ పల్లా భార్గ రెడ్డి, వైస్‌ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్‌, ఎంపీటీసీలు మేడ కల్యాణి, గుగులోత్‌ ఆశాజ్యోతి, బానోత్‌ యాఖూ, పానుగంటి గిరి, లావుడ్యా ఉపేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌,   శ్యామల విక్రంరెడ్డి, బస్వ మల్లేశ్‌, పల్లా సుందరాంరెడ్డి, గొడుగు మల్లికార్జున్‌, గుగులోత్‌ భగవాన్‌, తోటకూరి కిష్టయ్య, మేడ వెంకట్‌, జోగు సోమనర్సయ్య,చింత సోమయ్య, నల్ల ఉమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి జ్ఞాపిక అందజేత

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు జ్ఞాపికను అందజేశారు. నాయకులు మాట్లాడుతూ ఎర్రబెల్లి కృషితోనే మండలంలో సాగునీరు, తాగునీటి సమస్య తీరిందని, రహదారులతోపాటు మౌళిక వసతులు కల్పించారన్నారు.


VIDEOS

logo