మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jan 01, 2021 , 02:36:57

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలు గ్రామాల్లో పర్యటన 

నర్మెట, డిసెంబర్‌ 31 : పల్లెప్రగతిలో భాగంగా గ్రామా ల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. గురువారం తరిగొప్పుల మండలం బొంతగట్టునాగారంలో నిర్మిస్తున్న శ్మశానవాటికను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పనులు వేగంగా జరగాలని కోరారు. మరోవైపు అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, డీఆర్‌డీవో రాంరెడ్డి తరిగొప్పుల, బొంతగట్టునాగారం, భోజ్యతండా, అక్కరాజుపల్లి, మరియపురం, నర్సాపూర్‌, అబ్దుల్‌నాగారం గ్రామాల్లో పర్యటించారు. తడి, పొడి చెత్తషెడ్లు, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలను పరిశీలించి సర్పంచ్‌లకు సూచనలు చేశారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లిస్తామని ఈ  అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ వెల్లించారు. వారి వెంట డీఎల్‌పీవో గంగాభవాని, ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి, ఎంపీవో మల్లయ్య తదితరులు ఉన్నారు.

రోడ్డు విస్తరణ పనుల పరిశీలన

జనగామ- తరిగొప్పుల రహదారి విస్తరణ పనులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్‌, సర్పంచ్‌లు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, దామెర ప్రభుదాస్‌, భూక్య రవి, నాయకులు చింతకింది సురేశ్‌, పగడాల నర్సయ్య, కంతి రాజలింగం, సుదర్శన్‌గౌడ్‌ , వంగ ప్రణీత్‌రెడ్డి  ఉన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా : ముత్తిరెడ్డి

పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటాననిఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలంలోని బొత్తలపర్రె టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మాలి జాల భార్య శారద ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయన వెంట బొత్తలపర్రె, తరిగొప్పుల సర్పంచ్‌లు భూక్య రవి, దామెర ప్రభుదాస్‌, ఎంపీటీసీ మధుసూదన్‌రెడ్డి, నాయకులు జొన్నగోని సుదర్శన్‌, తాళ్లపల్లి రాజేశ్వర్‌, సంజీవ, రాజారాం ఉన్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నర్మెట మండలంలోని హన్మంతాపూర్‌ గ్రామానికి చెందిన దూసరి సతీశ్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని ముత్తిరెడ్డి అన్నారు. ఆయన వెంట ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, జడ్పీటీసీ మాలోత్‌ శ్రీనివాస్‌, జడ్పీ కోఅప్షన్‌ సభ్యుడు ఎండీ గౌస్‌, పగడాల నర్సయ్య, గుడికందుల నరహరి, చల్ల అంజయ్య, ఉపేందర్‌, శ్రీను, రమేశ్‌, పవన్‌ తదితరులు ఉన్నారు. 


VIDEOS

logo