బుధవారం 03 మార్చి 2021
Jangaon - Jan 01, 2021 , 02:36:59

యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

పాలకుర్తి రూరల్‌, డిసెంబర్‌ 31: యువత వ్యసనాలకు అలవాటు పడకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్‌ పర్సన్‌ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీనారాయణపురంలో ఎస్సై గండ్రాతి సతీశ్‌ నిరుపేద వృద్ధురాలికి నూతనంగా నిర్మించిన గృహన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఆనంతరం ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బండిపెల్లి రాజమ్మకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌ సైతం వృద్ధురాలకి ఆర్థిక సాయం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉషా దయాకర్‌రావు మాట్లాడుతూ యువత దయన్న స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలన్నారు. జీవితంలో ఎవరికైనా సాయం చేస్తే అది జీవితాంతం గుర్తుంటుందన్నారు. ఎస్సై సతీశ్‌ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మల్యాల సరిత పరశురాములు, ఎంపీటీసీ బెల్లి సోమయ్య, ఉప సర్పంచ్‌ బొడిగె ప్రదీప్‌, గజ్జి సంతోశ్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌లు గిలకత్తుల సుధాకర్‌, బండిపెల్లి మణెమ్మ, గుండెవేని కుమార్‌, గిలకత్తుల శంకరయ్య, గూడ యాదగిరి, చీటూరు చంద్రయ్య, పీసీలు ధనుంజయ, శ్రీనివాస్‌, రమేశ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo