శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Dec 31, 2020 , 02:04:06

సంక్షేమ పథకాలు గడపగడపకూ అందాలి

సంక్షేమ పథకాలు గడపగడపకూ అందాలి

  • ఎమ్మెల్యే రాజయ్య

లింగాలఘనపురం, డిసెంబర్‌30: సంక్షేమ పథకాలు గడపగడపకూ అందేలా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కృషి చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌  ఎమ్మెల్యే తాటికొండ  రాజయ్య అన్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 700 మంది దళితులకు మంజూరై మినీడెయిరీ రుణ పత్రాలను లబ్ధ్దిదారులకు  బుధవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే అందించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు గడగడపకూ వెళ్లి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  మంజూరు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించాలన్నారు. సమావేశంలో స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, మాజీ జడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి భిక్షపతి, టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌, దిశ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి,  విండో చైర్మన్లు  మల్గ శ్రీశైలం, ఉపేందర్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.    

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

స్టేషన్‌ ఘన్‌పూర్‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే రాజయ్య నియోజకవర్గ పరిధిలోని 31 మంది లబ్ధిదారులకు రూ.10,34,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌ , జఫర్‌గడ్‌ ఎంపీపీ రడపాక సుధర్శన్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎంపీటీసీ మునిగల రాజు, నియోజకవర్గ నాయకులు గుజ్జారి రాజు, ఇల్లందుల శ్రీనివాస్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పులి ధనుంజయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo