శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 31, 2020 , 02:04:07

కొనసాగిన గ్రామ సభలు

కొనసాగిన గ్రామ సభలు

  • పల్లె ప్రగతి పనులు, నిధులు విడుదలపై చర్చ

స్టేషన్‌ఘన్‌పూర్‌/పాలకుర్తిరూరల్‌/నర్మెట/బచ్చన్నపేట/ దేవరుప్పుల, డిసెంబర్‌ 30 : పలు మండలాల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులు, వాటికి సంబంధించిన బిల్లుల విడుదలపై బుధవారం గ్రామసభులు నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని తానేధార్‌పల్లి గ్రామంలో సర్పంచ్‌ గాదే చంద్రయ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. మండల కేంద్రంలోని జాతీయ రహధారిపై నిర్మిస్తున్న ైప్లె ఓవర్‌ బ్రిడ్జికి తమ గ్రామంలోని గుట్ట నుంచి ఏడు నెలలుగా మట్టిని తరలిస్తున్నారని, వాహనాలతో దుమ్ము ఎక్కువగా రావడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,కాంట్రాక్టర్‌తో మాట్లాడి మరమ్మతు చేయించాలని అధికారులను గ్రామస్తులు కోరారు. తానేధార్‌పల్లి గ్రామంలో బత్తిని అశోక్‌, బత్తిని కుమార్‌ గ్రామ పంచాయతీకి 63 కుర్చీలు, గ్రామ పంచాయతీ రెవెన్యూ నక్ష ఫొటో, నోటీస్‌ బోర్డులను, మహనీయుల ఫొటోలను, వాటర్‌ క్యాన్‌లను అందించారు. వీరిని గ్రామస్తులు అభినందించారు. మండల ప్రత్యేకాధికారి భిక్షపతి, ఎంపీవో మహబూబ్‌ అలీ,  ఏపీఎం కవిత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, పీఆర్‌ ఏఈ జుమ్కిలాల్‌, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఏఈ రజిత, ఈజీఎస్‌ ఏపీవో సతీశ్‌చారి, ఎంపీటీసీ లలిత, ఉప సర్పంచ్‌ లలిత హరితరాజు,  నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు మాచర్ల గణేశ్‌, గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా చందర్‌రెడ్డి, బత్తిని అశోక్‌, బత్తిని కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని కొండాపురంలో పెండింగ్‌ బిల్లుల విడుదలపై గ్రామసభ సర్పంచ్‌ మంగ భాగ్యమ్మ  అధ్యక్షతన నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి ఏపీడీ ఎండీ నూరొద్దీన్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో జరిగిన పనులకు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లు పంచాయతీ కార్యదర్శులు పనుల నివేదికలను సమర్పించాలన్నారు. ఎంపీడీవో ఆశోక్‌కుమార్‌, పీఆర్‌ ఏఈ పాషా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రశాంతి, ఎంపీవో దయాకర్‌, ఏపీవో అంబాల మంజుల, ఎంపీటీసీ లావుడ్యా లలిత దేవేందర్‌ పాల్గొన్నారు. నర్మెట మండలంలోని లోక్యతండాలో గామసభను సర్పంచ్‌ లకావత్‌ కిరాణ్‌నాయక్‌ అధ్యక్షతన నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి దామోదర్‌రావు మాట్లాడారు. ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్‌, ఎంపీవో గఫూర్‌ పాల్గొన్నారు. బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ది పూర్తి చేయాలని  మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రఘురామకృష్ణ అన్నారు. లక్ష్మాపూర్‌లో సర్పంచ్‌  నవ్యా-నర్సిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో వారు  మాట్లాడారు. ఏఈలు శ్రీనివాస్‌, అరుణారెడ్డి, ఈసీ మోహన్‌, ఏపీఎం జ్యోతి,  ఉప సర్పంచ్‌  శివరాత్రి తిరుపతి,  టీఏ, కరుణాకర్‌, పంచాయతీ కార్యదర్శి చక్రధర్‌,  వార్డు సభ్యులు  పాల్గొన్నారు. దేవరుప్పుల మండలంలోని లకావత్‌ తండా(డీ)లో సర్పంచ్‌ కవిత అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి కొండల్‌రెడ్డి  మాట్లాడుతూ పల్లెప్రగతి పనులకు ఉపాధిహామీ నిధులు విడుదలైనట్లు తెలిపారు. ఎంపీడీవో ఉమామహేశ్వర్‌, ఏపీవో శ్రీనివాస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మానస, పంచాయత్‌ కార్యదర్శి మహేశ్‌, పాండు ఉన్నారు.  


VIDEOS

logo