శనివారం 06 మార్చి 2021
Jangaon - Dec 31, 2020 , 01:50:10

శభాష్‌ సతీశ్‌..!నిలువనీడలేని వృద్ధురాలికి ఇల్లు

శభాష్‌ సతీశ్‌..!నిలువనీడలేని వృద్ధురాలికి ఇల్లు

  • సొంత ఖర్చుతో కట్టించిన ఇచ్చిన పాలకుర్తి ఎస్సై 
  • సేవలను కొనియాడుతున్న ప్రజలు
  • ఆనందం వ్యక్తం చేస్తున్న వృద్ధురాలు రాజమ్మ

పాలకుర్తి రూరల్‌ : ఖాకీ డ్రెస్‌ వెనుక కఠినత్వమే కాదు మానవత్వం ఉందని నిరూపిస్తున్నారు కొందరు పోలీసులు. వృత్తిలో మంచి పేరు తెచ్చుకుంటూనే సమాజ సేవ కార్యక్రమా ల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీశ్‌ ఈ కోవకు చెందినవారే. ఇటీవల నిలువనీడ లేని ఓ నిరుపేద వృద్ధురాలికి ఇల్లు కట్టించి తన పెద్దమనస్సు చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన బండిపెల్లి రాజమ్మకు 80ఏళ్లు. ఆమె తన వికలాంగుడైన కుమారుడితో కలిసి ఓ పూరి గుడిసెలో ఉంటోం ది. అది కూడా ఇటీవలి వర్షాలకు కూలిపోయింది. కోడలు ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అయితే, ఇంటికి తలుపులు లేకపోవడంతో ఇంట్లోకి పాము వచ్చి ఆరేళ్ల మనువరాలును కాటేయడంతో చనిపోయింది. ఇద్దరిని కోల్పోయి దుఃఖం ఓ వైపు వికలాంగుడైన బాగోగులు మరోవైపు ఇలా వృద్ధురాలు అభాగ్యురాలిగా మారడం అతడిని కలిచివేసింది. ఇలా రోడ్డున పడడం చూసి సతీశ్‌ చలించిపోయాడు. ఎలాగైనా వృద్ధురాలికి ఇళ్లు కట్టించాలనుకున్నాడు. సుమారు ఒక లక్ష 60 వేలతో వృద్ధురాలికి నూతనంగా రేకుల ఇళ్లు నిర్మించాడు. తన స్వంత ఖర్చులతో నిర్మించడంతో గ్రామస్తులు ఎస్సై సతీశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.


VIDEOS

logo