ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 30, 2020 , 00:49:52

పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

  • గ్రామసభల్లో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ ఆదేశం

జఫర్‌గఢ్‌, డిసెంబర్‌ 29 :  పల్లెప్రగతిలో చేపట్టిన పనుల ను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అధికారులను కోరారు. మండలం లోని తమ్మడపల్లి(జీ)లో మంగళవారం సర్పంచ్‌ అన్నెపు పద్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో అబ్దుల్‌ హమీద్‌ మాట్లాడుతూ పూర్తి చేసిన పనులకు బిల్లు చెల్లిస్తున్నామన్నారు. డీఆర్‌డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో రమాదేవి మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు చిలువేరు శివయ్య, ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఎంపీవో శ్రీనివాస్‌  పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

నర్మెట :  గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి దామోదర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని సూర్యబండతండాలో సర్పంచ్‌ భూక్య నీలా లాలు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. దామెదర్‌రావు మాట్లాడుతూ. గ్రామంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్‌, ఎంపీవో గఫూర్‌, ఉపసర్పంచ్‌ దరంసోత్‌ కొమురెల్లి, పంచాయతీ కార్యదర్శి సంతోష్‌కుమార్‌, వార్డు సభ్యులు రజిత, సునీత, రాజన్న పాల్గొన్నారు. 

వాచ్యతండాలో గ్రామసభ

తరిగొప్పుల(నర్మెట) : తరిగొప్పుల మండలం వాచ్యతండాలో సర్పంచ్‌ బానోత్‌ రవి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో మండల ప్రత్యేకాధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి పాల్గొన్నారు. అభివృద్ధి పనుకు సంబంధించి పెండింగ్‌ బిల్లులుంటే చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి, ఎంపీవో మల్లయ్య, ఏపీవో లింగయ్య పాల్గొన్నారు. 

అభివృద్ది పనులు పూర్తి చేయాలి

రఘునాథపల్లి: పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి హసీం అన్నారు. మండలంలోని కోమల్లలో నిర్వహించిన గ్రామసభకు సర్పంచ్‌ బొల్లపల్లి మంజుల అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడారు. యాసంగి పంటల పెట్టుబడి కోసం రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రతి కూలీకి ఉపాధిహామీలో పనులు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి, ఏఈ రామలింగాచారి, శ్రీనివాస్‌, ఏపీవో సారయ్య పాల్గొన్నారు.

మొక్కలకు ప్రతిరోజు నీరు పట్టాలి

జనగామ రూరల్‌: పల్లెప్రగతిలో చేపట్టిన పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్‌ షెడ్‌, శ్మశాన వాటికలోని మొక్కలకు ప్రతిరోజూ నీరు పట్టాలని ఎంపీడీవో బిరుదు హిమబిందు అన్నారు. మండలంలోని శామీర్‌పేటలో జరిగిన గ్రామసభలో అమె మాట్లాడుతూ గ్రామా ల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే చెల్లిస్తున్నామన్నారు. మండల ప్రత్యేకాధికారి శంకర్‌రావు, ఎం పీవో ఉప్పుగల్లు సంపత్‌ కుమా ర్‌, సర్పంచ్‌ మాం డ్ర రవికుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కమలాకర్‌, పీఆర్‌ ఏఈ శ్రీనివాస్‌, ఏపీవో భిక్షపతి, ఏపీఎం నరేందర్‌, ఈసీ మాధవరెడ్డి, టీఏ అనిల్‌, పంచాయతీ కార్యదర్శి ఇఫ్తికారుద్దీన్‌, కారోబార్‌ పాషా పాల్గొన్నారు. 

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : ప్రజాసమస్యలను పట్టించుకోని అధికారుల తీరుపై మండల కేంద్రంలోని శివునిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కొందరు అధికారులు సమస్యలను పరిష్కరిం చడం లేదన్నారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టి నెలలు గడుస్తున్నా నేటికీ డ్రైనేజీ పనులు పూర్తి కాలేదన్నారు.  మండల ప్రత్యేక అధికారి భిక్షపతి మాట్లాడుతూ స్థానికంగా సమస్యలుంటే గ్రామ పంచాయతీకి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో డీఎల్‌పీవో కనకదుర్గ, ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీవో మహబూబ్‌అలీ, పీఆర్‌ ఏఈ జుమ్కి లాల్‌, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్‌, రాజు, గ్రామాభివృద్ధి ప్రణాళిక అధ్యక్షుడు మహ్మద్‌ దస్తగిరి, వార్డు సభ్యుడు బూర్ల విష్ణు, పీహెచ్‌సీ డాక్టర్‌ కవిత పాల్గొన్నారు.  


VIDEOS

logo