ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Dec 30, 2020 , 00:35:08

కేటీఆర్‌, కవితను కలిసిన గద్దల పద్మ

కేటీఆర్‌, కవితను కలిసిన గద్దల పద్మ

జనగామ, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మహిళా కమిషన్‌ సభ్యురాలు గద్దల పద్మ మంగళవారం హైదరాబాద్‌ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించడం, పదవీ కాలం ముగిసిన తర్వాత కీలకమైన మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా నియమించడంపై ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళగా తనకు కమిషన్‌లో అరుదైన గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని గద్దల పద్మ అన్నారు. ఆమె వెంట టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గద్దల నర్సింగరావు, రఘునాథపల్లి మండల నాయకులు మంద రమేశ్‌ ఉన్నారు. 

VIDEOS

logo