బుధవారం 03 మార్చి 2021
Jangaon - Dec 28, 2020 , 00:44:28

బాధితుడికి ఎమ్మెల్సీ కడియం ఆర్థిక సాయం

బాధితుడికి ఎమ్మెల్సీ కడియం ఆర్థిక సాయం

జఫర్‌గఢ్‌, డిసెంబర్‌ 27 : మండలంలోని కోనాయిచలం గ్రామానికి చెందిన సింగపురం ఆగయ్య ఇల్లు ఇటీవల విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన నేపథ్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆదివారం బాధితుడిని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను శ్రీహరి తెలుసుకుని బాధితుడి కుటుంబానికి రూ.17 వేలు ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర వస్తువులు అందించారు. డబుల్‌బెడ్‌రూం ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చి ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్‌ సంపత్‌రెడ్డి, ఓబులాపూర్‌ సర్పంచ్‌ నీరజా రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కరుణాకర్‌రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటస్వామి, రాజేశ్‌నాయక్‌, మాజీ ఎంపీపీ ఆయోధ్య, నాయకులు అన్నెపు అశోక్‌, మారపల్లి ప్రభాకర్‌, కాటం రాజిరెడ్డి, కడియం యువసేన అధ్యక్షుడు ఎలమకంటి నాగరాజు, ఎంపీటీసీ దేవేందర్‌, నాయకులు సుధాకర్‌ బాబు, శ్రీనివాస్‌, ధనుంజయ్‌, హరి , నవీన్‌ తదితరులు ఉన్నారు.

వృద్ధురాలికి ఆర్థిక సాయం

కోనాయిచలం వెళ్లివస్తున్న కడియం శ్రీహరికి పొలాల్లో నాట్లు వేస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తీసుకున్నారు. నాటేస్తున్న వారిలో వృద్ధురాలు ఉండడంతో ఆమెతో కడియం శ్రీహరి మాట్లాడి రూ.2 వేలు ఆర్థిక సాయం అందించారు. 

VIDEOS

logo