ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Dec 28, 2020 , 00:44:30

టీఆర్‌ఎస్‌ బాలానగర్‌ కార్పొరేటర్‌కు సన్మానం

టీఆర్‌ఎస్‌ బాలానగర్‌ కార్పొరేటర్‌కు సన్మానం

రఘునాథపల్లి డిసెంబర్‌ 27: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బాలానగర్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన ఆవుల రవీందర్‌రెడ్డి ఆదివారం తన స్వగ్రామమైన మండలంలోని కుర్చపల్లికి రాగా గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా నాయకుడు మారుజోడు రాంబాబుతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌రెడ్డికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ సం దర్భంగా రాంబాబు మాట్లాడుతూ కుర్చపల్లికి చెందిన రవీందర్‌రెడ్డి హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. కార్పొరేటర్‌ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో బాలానగర్‌ను అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వై కుమార్‌గౌడ్‌, బీసీ సెల్‌ జిల్లా నాయకులు జిట్టె వీరస్వామి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ గొరిగె రవి, నాయకులు నామాల బుచ్చ య్య, వడ్లకొండ శివప్రసాద్‌, నరేశ్‌; భిర్రు మధు, రంగు అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo