గ్రామాల్లో జోరుగా ఉపాధిహామీ పనులు

- ఫాంపాండ్స్ నిర్మాణంతో పెరుగుతున్న భూగర్భ జలాలు
- కూలీలు, వ్యవసాయదారులకు లబ్ధి
స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబర్ 26 : ఉపాధిహామీ పథకంతో గ్రామాల్లో జోరుగు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఫాంపాండ్స్ నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగుతుండగా కూలీలతోపాటు పేదలకు ఉపాధి లభిస్తున్నది. ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలో 11293 జాబ్ కార్డులుండగా, 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 550 జాబ్ కార్డులిచ్చారు. ఉపాధిహామీ పనులకు వెళ్లిన పనులను బట్టి రోజుకు ఒక్కొక్కరికి రూ.151 నుంచి రూ.237 వరకు లభిస్తున్నాయి. ఒకప్పుడు రోడ్ల పనులే జరుగగా తాజాగా వ్యవసాయదారుల బావుల వద్దకు దారుల ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వర్షపు నీరు వృథాకాకుండా రైతుల భూముల్లో ఫాంపాండ్స్ నిర్మాణం పెంచారు. మరికొన్నిచోట్ల ఫిష్‌ఫాండ్స్ నిర్మిస్తున్నారు. గ్రామాల్లో ఇళ్ల ముందు ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకున్న వారికి రూ.4 వేలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మండలంలో 850 ఇంకుడుగుంతలు నిర్మించారు. మరొకొన్ని గ్రామా ల్లో చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టడంతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తున్నది.
హరితహారంతో ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కులు నాటుతున్నారు. వీటిని ఉపాధిహామీ పథకంలో చేపట్టడంతో కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తున్నది. ఇప్పటి వరకు మండలంలో 173 స్థలాల్లో 1,31,578 మొక్కలు నాటగా వీటిలో 1,23,195 మొక్కలు సజీవంగా ఉన్నాయి. హరితహారంలో 91 శాతం మొక్కలు సంరక్షించడంతో సర్కారు లక్ష్యం నెరవేరుతున్నది. ఇదిలా ఉండగా ఉపాధిహామీ పథకంలో గుట్టలపై నుంచి వచ్చే వర్షపునీటికి పలుచోట్ల అడ్డుకట్ట వేయడంతోపాటు కందకలు తీస్తుండడంతో చెట్లు పెరుగుతున్నాయి. పచ్చదనం ఉట్టిపడుతుండడంతో వన్యప్రాణులతోపాటు పక్షలు, వానరాలకు ఆవాసంగా మా రింది. పల్లెప్రగతిలో భాగంగా మండలంలో 22 నర్సరీలను ఉపాధిహామీలో చేపట్టడంతో కూలీలకు ఆదాయం సమకూరుతున్నది. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో బాగంగా మండలంలో 22 నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. పల్లెప్రకృతి వనాలు, తడిపొడి చెత్త షెడ్లను ఉపాధిహామీలో చేపట్టడంతో గ్రామా ల్లో అభివృద్ధి పనులు పెరిగాయి.
అడిగిన వారందరికీ ఉపాధిహామీ పనులు
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పథకంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పల్లెప్రకృతివనాలు, నర్సరీలతోపాటు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం వంటివి ఉన్నాయి. అడిగిన వారందరికీ ఉపాధిహామీలో పనులు కల్పిస్తున్నాం. పనులు చేసిన వారికి పక్షం రోజులకోసారి పోస్టాఫీసు నుంచి నగదును వారి ఖాతాలో జమచేస్తున్నాం. దీంతో గ్రామాల్లో కూలీలకు ఎక్కువ రోజులు ఉపాధి లభిస్తున్నది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది.
-కాశోజు సతీశ్‌చారి, ఉపాధిహామీ ఏపీవో, స్టేషన్‌ఘన్‌పూర్
తాజావార్తలు
- లావణ్య త్రిపాఠి ఎంటర్టైనింగ్ పర్సన్: రామ్
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోను : హర్యానా మంత్రి అనిల్ విజ్
- ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా?
- డబ్బు, నగల కోసం వృద్ధురాలు దారుణ హత్య.!
- సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం