మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Dec 26, 2020 , 03:04:09

అంబరాన్నంటిన క్రిస్మస్‌ సంబురాలు

అంబరాన్నంటిన క్రిస్మస్‌ సంబురాలు

  • వేడుకల్లోపాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ  శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య

జనగామ క్రైం, డిసెంబర్‌ 25 : యేసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం జిల్లాలోని చర్చిల్లో క్రిస్మస్‌ సంబురాలు అంబరాన్నంటాయి. జనగామలోని ఉనృపుర తెలుగు బాప్టిస్ట్‌ చర్చి, యూనిక్‌ చర్చి మినిస్ట్రీస్‌, రూథర్‌ఫోర్డు బాప్టిస్ట్‌ చర్చి, క్యాథలిక్‌ చర్చి, ఇమ్మానుయేల్‌ చర్చి, జియాన్‌ చర్చి, గెత్సేమనే ప్రార్థనా మందిరాల్లో దైవ ప్రసంగీకులు ఫిలిప్‌, నర్సింగరావు, రవికుమార్‌, యాటెల్లి చిట్టిబాబు, మోజెస్‌కుమార్‌, జేమ్స్‌ వేడుకలు క్రిస్మస్‌ వేడులు నిర్వహించారు. దారి తప్పిన గొర్రె పిల్లలను సన్మార్గంలో నడపడానికి దైవ కుమారుడు యేసుక్రీస్తు లోక్ష రక్షకుడిగా జన్మించారని వారు వివరించారు.శాంతి, సహనం, ప్రేమ అనేవి క్రీస్తు చూపిన మార్గాలని పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో చర్చిల వద్ద మత గురువులు జాగ్రత్తలు పాటించారు. 

జనగామ రూరల్‌లో..

జనగామ రూరల్‌ : జనగామ మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎల్లంల సెంటినరి తెలుగు బాప్ట్ట్టిస్టు చర్చిలో పాస్టర్‌ సంజీవకుమార్‌ యేసుక్రీస్తు బోధనలు వినిపించారు. విజయవాడ నుంచి వచ్చిన యువతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యశ్వంతాపూర్‌లోని షాలోమి బాప్టిస్టు చర్చిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దరాంచర్ల, పెంబర్తి, ఓబుల్‌కేశ్వాపూర్‌, వడ్లకొండ, చీటకోడూరు, చౌడారం, గానుగుపహాడ్‌, సిద్ధెంకి గ్రామాల్లోని చర్చిల్లో మత గురువులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల కలింగరాజు తదితరులు పాల్గొన్నారు.

నర్మెట, తరిగొప్పులలో..

నర్మెట : మండల కేంద్రంతో పాటు ఆగపేట, గుంటూరుపల్లి, వెల్దండ, కన్నెబోయినగూడెం, గండిరామవరం, అమ్మాపురం, హన్మంతాపురం, బొమ్మకూరు తదితర గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. తరిగొప్పుల మండల కేంద్రంతోపాటు నర్సాపూర్‌, పోతారం, అంకుషాపురం, అబ్దుల్‌నాగారం, సోలిపురం, బొత్తలపర్రె, మరియపురం తదితర గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించి యేసుక్రీస్తు జీవిత చరిత్రను పాస్టర్లు వినిపించారు.

మహిళలకు చీరల పంపిణీ

నర్మెటలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో గడపురం కొమురయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు గడపురం శశిరథ్‌ శుక్రవారం పేద మహిళలు, వృద్దులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్‌ దేవదానం, యూత్‌ సభ్యులు సురేశ్‌, మహేశ్‌, ఉదయ్‌, ప్రభాకర్‌, వినయ్‌, శశికాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట : మండల కేంద్రంలోని షాలేము ప్రార్థన మందిరంలో ఫాస్టర్‌ సాల్మన్‌రాజు అధ్యక్షతన క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి కేకు కట్‌ చేసి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కట్కూర్‌లోని సినాయ్‌ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో పిన్నింటి స్టాన్లీ, సరోజారెడ్డి, ఇమ్మానుయేల్‌, ప్రభుదాసు, ఇస్సాక్‌, ప్రమోద్‌, ఆశీర్వాదం, శ్రావణ్‌, దేవదాసు పాల్గొన్నారు. బచ్చన్నపేటలో సర్పంచ్‌ వడ్డేపల్లి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నరేందర్‌, ఉపేందర్‌రెడ్డి, షబ్బీర్‌, పాస్టర్‌ జంపాల పరశురాములు పాల్గొన్నారు.

రఘునాథపల్లిలో

రఘునాథపల్లి : మండల కేంద్రంలోని లూర్థుమాత చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశువుల పాకలో యేసు జన్మించినట్లు తెలిపే చిత్రాలను ప్రదర్శించారు. కంచనపల్లి, కోమల్ల, గోవర్దనగిరి, అయ్యావారిగూడెం, ఖిలాషాపురం గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోమల్లలో బొల్లపల్లి వెంకట్‌ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీతోపాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు సునిల్‌కుమార్‌, వెంటస్వామి, ఎంపీపీ మేకల వరలక్ష్మి, సర్పంచ్‌ బొల్లపల్లి మంజుల, జాన్‌బన్నీ, మేకల అజయ్‌ పాల్గొన్నారు.

దేవరుప్పులలో

దేవరుప్పుల : దేవరుప్పులలోని బాలయేసు పాఠశాలలో నల్లగొండ చర్చికి చెందిన ఫాదర్‌ మ్యాథ్యూస్‌ చాపెల్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ వేడుకలను ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. కడవెండిలో తిరు కుటుంబం చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ధర్మగడ్డ తండాలోని చర్చిలో ధరావత్‌ తండా సర్పంచ్‌ గేమానాయక్‌, ధర్మగడ్డ తండా సర్పంచ్‌ సునీత నేతృత్వంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బాలయేసు పాఠశాల కరెస్పాండెంట్‌ బ్రదర్‌ జేసురాజ్‌,  లీనారెడ్డి  పాల్గొన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్‌ : మండల కేంద్రంలోని ఆర్‌సీఎం చర్చి ఆవరణలో ఫాదర్‌ నమిండ్ల సురేందర్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఫాతిమామేరి (భారతి) దంపతు లతోపాటు వారి కుమారులు డాక్టర్‌ క్రాంతిరాజ్‌, డాక్టర్‌ వీరాజ్‌, కోడళ్లు డాక్టర్‌ సింధూరి, డాక్టర్‌ శీతల్‌, ఫాదర్‌ భరత్‌, ఫాదర్‌ తాటికొండ జోసఫ్‌, ఆర్‌సీఎం చర్చి సంఘపెద్దలు చంద్రమౌళి, నాగయ్య, రాజ్‌కుమార్‌, అనిత, ఎడ్ల సులోచన, ప్రమీల, ఎలిషా, తాటికొండ మధు, ఆరోగ్యరెడ్డి, పునీత సిసిలియా గాయని బృందం తాటికొండ అనిత, తాటికొండ సురేశ్‌, బాలవంశీ, చరణ్‌, బాలస్వామి, సున్నం యాదగిరి, ఆకారపు అశోక్‌, చింత భరత్‌కుమార్‌, చింత ప్రభుదాస్‌, రవి పాల్గొన్నారు.

జఫర్‌గఢ్‌లో..  

జఫర్‌గఢ్‌ : మండలంలోని తమ్మడపల్లి(ఐ) చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గాదెపాక అనిత, ఉప సర్పంచ్‌ రవీందర్‌ రెడ్ఢి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షు ఏడు వెంకటస్వామి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ పాలనలోనే పండుగలకు గుర్తింపు : ఎర్రబెల్లి

పాలకుర్తి రూరల్‌, డిసెంబర్‌ 25 : సీఎం కేసీఆర్‌ పాలనలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని ఎల్లరాయిని తొర్రూరు చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఎర్రబెల్లి పాల్గొన్నారు. పాస్టర్‌ మోజెస్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని మతాలను, పండుగలను సమానంగా చూస్తున్నారన్నారు. క్రిస్మస్‌, రంజాన్‌, బతుకమ్మ పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ కానుకలను అందిస్తున్నదన్నారు. తాను 35 ఏళ్ల క్రితం ఇజ్రాయిల్‌లోని జెరూసలెం వెళ్లానని గుర్తు చేశారు. యేసు దయతో అందరూ చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లానాగిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, సర్పంచ్‌ నాయిని మల్లారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొనె మైసిరెడ్డి, గజ్జి సంతోశ్‌కుమార్‌, బజ్జూరి వేణుగోపాల్‌, పసులాది శంకర్‌, యాకస్వామి, లోనె శ్రీనివాస్‌, పులి ఏలేంద్ర, గోనె బాబు, శివరాజు పాల్గొన్నారు.


VIDEOS

logo