బుధవారం 03 మార్చి 2021
Jangaon - Dec 25, 2020 , 03:05:48

కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలి

కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలి

  • ఎంపీడీవో

స్టేషన్‌ఘన్‌పూర్‌, డిసెంబర్‌ 24 : గ్రామాల్లో ప్రతిరోజూ కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని ఎంపీడీవో కుమారస్వామి అన్నారు. మండలంలో ని రంగరాయగూడెంలో సర్పంచ్‌ మొ దుపల్లి అనూష అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. కుమారస్వామి మాట్లాడుతూ పేదలకు పనులు కల్పించాలనే ధ్యేయంతో ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిరుపేదలకు ప్రతిరోజూ కనీసం 50 మందికి పనులు చూపాలని ఆయన సూచించారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులు పూర్తి చేయిస్తే వెంటనే బిల్లులు చెల్లిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి భిక్షపతి, ఎంపీవో మహబూబ్‌అలీ, పీఆర్‌ ఏఈ జుమ్మిలాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రజిత, ఉపాధిహామీ ఏపీవో సతీశ్‌, వెలుగు ఏపీఎం కవిత, ఉప సర్పంచ్‌ అయిత రమేశ్‌, ఎంపీటీసీ శైలజ, వార్డు సభ్యులు నాగరాజు, రంగారెడ్డి, రాజమ్మ  పాల్గొన్నారు.


VIDEOS

logo