గురువారం 04 మార్చి 2021
Jangaon - Dec 25, 2020 , 03:05:48

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి

  • రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ క్రైం, డిసెంబర్‌ 24 : యాదాద్రి-వరంగల్‌ హైవే పక్కనే జనగామ మండలం యశ్వంతాపూర్‌ సమీపంలో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ వచ్చే నెలాఖరుకల్లా భవన నిర్మాణం పూర్తి చేయాలని కాం ట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు పూర్తయితే వచ్చే కొ త్త సంవత్సరంలో దీనిని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. మంత్రి ఎర్రబెల్లి వెంట జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు సేవెల్లి సంపత్‌, రఘునాథపల్లి సర్పంచ్‌ పోకల శివకుమార్‌, నామాల బుచ్చయ్య, దూసరి గణపతి తదితరులు ఉన్నారు. 


VIDEOS

logo