గురువారం 04 మార్చి 2021
Jangaon - Dec 24, 2020 , 01:43:40

పల్లెప్రగతి పనుల బిల్లులు చెల్లించాలి

పల్లెప్రగతి పనుల బిల్లులు చెల్లించాలి

  • గ్రామసభల్లో అధికారుల ఆదేశం

దేవరుప్పుల, డిసెంబర్‌ 23 : పల్లెప్రగతి కార్యక్రమ ంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని, ఉపాధిహామీలో ఆలస్యమైతే గ్రామపంచాయతీ నిధుల నుంచి వినియోగించుకోవాలని ఎంపీడీవో ఉమామహేశ్వర్‌ అన్నారు. మండలంలోని గొల్లపల్లిలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్‌ కోనేటి సుభాషిణి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పనుల పెండింగ్‌ బిల్లులపై చర్చించారు.తడి, పొడి చెత్త వేరుచేసే షెడ్డుకు రూ.1.8 లక్షలు, నర్సరీకి రూ.20 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. వీటి పనులకు సంబంధించి వెంటనే రికార్డు చేసి గ్రామపంచాయతీ నిధుల నుంచి ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఉమామహేశ్వర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జాకీర్‌, ఉపసర్పంచ్‌ తీగల యాకన్న, ఏపీవో శ్రీనివాస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మానస, పంచాయతీ కార్యదర్శి పాండు, టీఏ వెంకటేశ్‌, వార్డు సభ్యులు సమ్మక్క, కొమురమ్మ, ఉప్పలయ్య, పరశురాములు, వీరమ్మ, యాద మ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో ఆదర్శం కట్కూర్‌ : ఎంపీడీవో

బచ్చన్నపేట : పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కట్కూర్‌ గ్రామం అదర్శంగా నిలిచిందని ఎంపీడీవో రఘురామకృష్ణ అన్నారు. బుధవారం  సర్పంచ్‌ ముశిని సునీతరాజుగౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఏఈలు శ్రీనివాస్‌, అరుణారెడ్డి, ఈసీ మోహన్‌ పాల్గొన్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ శ్మశానవాటిక, నర్సరీ, పల్లెప్రకృతివనం, డంపింగ్‌యార్డు, రైతువేదిక భవనం ఒకే చోట ఉండడం అభినందనీయమన్నారు. మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నర్సరీ అందంగా ఆకర్షణీయంగా ఉందన్నారు. డంపింగ్‌యార్డు, ప్రకృతి వనం పనులు పూర్తయ్యాయని, పెండింగ్‌ బిల్లులకు సంబంధించి ఎంబీ రికార్డు చేశామన్నారు. సర్పంచ్‌లు పనుల్లో పారదర్శకత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌ఆచార్య, టీఏ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo