సోమవారం 08 మార్చి 2021
Jangaon - Dec 23, 2020 , 00:38:43

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలి

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలి

పాలకుర్తి రూరల్‌, డిసెంబర్‌22: పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేసి ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగించాలని జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏసీపీ గొల్ల రమేశ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. నేరాల వివరాలను స్థానిక పరిస్థితులను డీసీపీకి సీఐ చేరాలు వివరించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పోలీసులు సివిల్‌ భూ తగాదాల్లో తలదూర్చారాదని సూచించారు. అవీనీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. గుడుంబా గంజాయి రవాణా వంటిపై ప్రత్యేక నిఘూ పెట్టాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు. పోలీసుల పనీతీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. డీజీపీ, సీపీ ఆదేశాల మేరకు నడుచుకోవాలన్నారు. ఆయన వెంట ఏసీపీ గొల్ల రమేశ్‌, సీఐ చేరాలు, ఎస్సైలు గండ్రాతి సతీశ్‌, సీహెచ్‌ కర్ణాకర్‌రావు, సతీశ్‌ ఉన్నారు.

ఏసీపీ కార్యాలయం తనిఖీ

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంధ్రంలోని ఏసీపీ కార్యాలయాన్ని మంగళవారం జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులను పరిశీలించి వివిధ కేసుల వివరాలు తెలుసుకున్నారని ఇన్‌చార్జి ఏసీపీ వినోద్‌ తెలిపారు. రఘునాథపల్లి రూరల్‌ సీఐ బాలాజీ వరప్రసాధ్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

logo