సోమవారం 08 మార్చి 2021
Jangaon - Dec 23, 2020 , 00:38:52

ఆన్‌లైన్‌ మనీ యాప్‌నిర్వాహకులపై సైబర్‌ క్రైం కేసు

ఆన్‌లైన్‌ మనీ యాప్‌నిర్వాహకులపై సైబర్‌ క్రైం కేసు

జనగామ క్రైం: ఆన్‌లైన్‌ మనీ యాప్‌ ని ర్వాహకులపై సైబర్‌ క్రైం కేసు నమోదు చేసినట్లు జనగామ ఎస్సై రాజేశ్‌నాయక్‌ తెలిపా రు. ఆయన కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌ ఏరియా కు చెందిన పసునూరి శ్రీనివాస్‌ అనే యు వకుడు రెండు నెలల క్రితం తన అవసరాల నిమిత్తం ఓ ఆన్‌లైన్‌ మనీయాప్‌ నుంచి రూ.30వేలు అప్పుగా తీసుకున్నాడు. తిరి గి చెల్లించడం ఆలస్యం కావడంతో మనీ యాప్‌ నిర్వాహకులు అధిక వడ్డీ వేయడంతోపాటు వెంటనే అప్పు చెల్లించాలంటూ శ్రీనివాస్‌, అతడి స్నేహితుల సెల్‌ నంబర్ల కు వాయిస్‌ కాల్స్‌, వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ అసభ్యకరంగా దూషించారు. మానసికం గా వేధించారు. దీంతో శ్రీనివాస్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఆన్‌లైన్‌ మనీయాప్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈజీ మనీ కోసం ఆన్‌లైన్‌ యాప్‌ల మోజులో పడి యువకు లు తమ జీవితాలను నాశనం చేసుకోవద్ద ని ఎస్సై రాజేశ్‌నాయక్‌ విజ్ఞప్తి చేశారు.


VIDEOS

logo