శనివారం 06 మార్చి 2021
Jangaon - Dec 22, 2020 , 01:17:19

డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

దేవరుప్పుల, డిసెంబర్‌21: దేవరుప్పులలో 49 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా సోమవారం అధికారులు గ్రామసభ నిర్వహించి లాటరీ పద్ధ్దతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. సర్పంచ్‌ ఈదునూరి రమాదేవి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్‌డీవో మధుమోహన్‌, ఎంపీపీ బస్వ సావిత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని అన్నారు. లబ్ధిదారుల జాబితా గ్రామపంచాయతీలో అందుబాటులో ఉంటుందని, ఎవరికైనా అభ్యంతాలు ఉంటే తహసీల్దార్‌కు తెలియజేస్తే పునఃవిచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తుది జాబితాను కలెక్టర్‌ ప్రకటిస్తారని అన్నారు. 49 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మాణం పూర్తికాగా  మంది డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కావాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 49లో   ఎస్సీలకు 10, ఎస్టీలకు 2, వికలాంగులకు 2, మైనారిటీలకు 1, ఇతరులకు 34 ఇండ్లు కేటాయించారు. ఈ ప్రాతిపదికన దరఖాస్తుల్లో 98 మంది వివిధ కేటగిరీలకు చెందిన అర్హులు ఉన్నట్లు గ్రామసభలో ప్రజల సమక్షంలో గుర్తించారు. వీరిలో నుంచి లాటరీ పద్ధ్దతిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ స్వప్న, ఎంపీటీసీ తోటకూరి రేణుక, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ నర్సింహారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాసరావు, యాదయ్య, వీఆర్‌వోలు మాన్‌సింగ్‌, అమరేందర్‌రెడ్డి, ఎల్లస్వామి, శ్రీకాంత్‌, శ్రీనివాసరావు, వార్డు సభ్యులు ఉన్నారు.


VIDEOS

logo