కర్షకుల కోసం ఆధునిక పరిజ్ఞానం

- ప్రారంభానికి సిద్ధంగా రైతువేదికలు
- ప్రత్యేక వసతులతో ఒక్కో భవనానికి
- రూ.22 లక్షల వ్యయం
- రఘునాథపల్లి మండలంలో ఏడు నిర్మాణం
రఘునాథపల్లి, డిసెంబర్ 20 : ఆధునిక పద్ధతిలో పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించడంతోపాటు వారు ఒకచోట చేరి సమావేశం నిర్వహించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నది. ఐదువేల ఎకరాల పరిధిలోని చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్ద రైతుల వరకూ అందరి సమస్యలను పరిష్కరించేందుకు వేదికలా ఇవి ఉపయోపడనున్నాయి. రైతును రాజు చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన తరుణంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల కోసం నిర్మిస్తున్న రైతువేదికలు ఆధునిక దేవాలయాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలో ఏడు క్లస్టర్లలో చేపట్టిన వీటి నిర్మాణం దాదాపు పూర్తయి త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతి ఐదు వేల ఎకరాలకు క్లస్టరుగా ఆధునిక వసతులు కల్పించేందుకు ఒక్కో రైతు వేదికకను రూ.22 లక్షలు వెచ్చిస్తున్నారు. కంచనపల్లి, కోమల్ల, ఖిలాషాపురం, రఘునాథపల్లి, కోడూరు, మాదారం, నిడిగొండ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను మొత్తం రూ.1.54 కోట్లతో పూర్తి చేస్తున్నారు. త్వరలో ఇవి కర్షకులకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు.
వ్యవసాయదారులకు ఎంతో ప్రయోజనం
పంటల సాగుకు సంబంధించిన ఏ సమాచారమైనా ఇప్పటి వరకు మండల వ్యవసాయ అధికారి వద్ద లభించేది. త్వరలో రైతు వేదికలు ప్రారంభిస్తే అక్కడే పూర్తి సమాచారం లభించనుంది. సీజన్ల వారీగా పంటల సాగు, ఎరువులు, పురుగు మందుల వినియోగంపై రైతులకు ఇక్కడి నుంచి సలహాలు, సూచనలు అందనున్నాయి. క్లస్టర్ల వారీగా రైతువేదికలు నిర్మించడంతో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై సూచనలు అందజేయనున్నారు. ఏ సీజన్లో రైతులు ఏఏ పంటలు సాగు చేయాలి.. వాటి ద్వారా పొందే ప్రయోజనంపై నిపుణులు వివరించనున్నారు. పం డించిన పంటకు గిట్టుబాటు ధర లభించని పక్షంలో రైతువేదికకు అనుబంధంగా రైతుబంధు సమితుల ద్వారా పంటలను కొనుగోలు చేయించి అక్కడే భద్రపరిచే సదుపాయం కల్పించనున్నా రు. దీని ద్వారా రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.
సీఎం కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారు
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడాలేని విధంగా రైతువేదికలను నిర్మిస్తున్నారు. మండలంలో ఏడు రైతువేదికలను పూర్తి చేయడం సంతోషంగా ఉంది. అభివృద్ధి పనుల్లో ముందున్న ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు కృతజ్ఞతలు
-గొరిగె రవి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్
రైతుల సమస్యల పరిష్కారానికి వేదిక
సీఎం కేసీఆర్ సూచనలకనుగుణంగా రైతు వేదికలు నిర్మిస్తు న్నాం. రైతులందరూ ఒకచోట చేరి పంటల సాగుపై చర్చిం చుకునేందుకు ఇవి దోహదపడుతాయి. వ్యవసాయ శాఖ కార్యాల యానికి వెళ్లకుండా ఇక్కడే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఏఈవోలు అందుబాటులో ఉండి ఏఏ సీజన్లో ఏఏ పంటలు సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తారు.
- కాకి శ్రీనివాస్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి
తాజావార్తలు
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..