బుధవారం 03 మార్చి 2021
Jangaon - Dec 21, 2020 , 01:42:16

బమ్మెర పోతన కవితా నీరాజనం ఆవిష్కరణకు మంత్రికి ఆహ్వానం

బమ్మెర పోతన కవితా నీరాజనం ఆవిష్కరణకు మంత్రికి ఆహ్వానం

పాలకుర్తి డిసెంబర్‌ 20: ఈ నెల 27న మం డలంలోని బమ్మెరలో నిర్వహించే మహాకవి బమ్మెర పోతన కవితా నీరాజనం గ్రంథావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును లయన్స్‌ బాధ్యులు ఆదివారం కలిశారు. లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు రాపాక విజయ్‌ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని ఎర్రబెల్లిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ బమ్మెర పోతన గురించి అనేక మంది కవులు రాసిన కవితా నీరాజనాలను పుస్తక రూపంలో ప్రచురించిన కవి వేముల శ్రీచరణ్‌ సాయి దాస్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బుచ్చిరెడ్డి, అశోక్‌కుమార్‌, సారంగపాణి, తాళ్లపల్లి ఉప్పలయ్య, ఎండీ అబ్బాస్‌ అలీ, వర్రె వెంకన్న, పోగు శ్రీనివాస్‌ , చెన్నూరు వెంకటేశ్వర్లు, రవీందర్‌, సోమన్న పాల్గొన్నారు.


VIDEOS

logo