రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- ఎమ్మెల్యే శంకర్‌నాయక్
- రైతువేదిక భవనాలు ప్రారంభం
కేసముద్రం : రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మండలంలోని పెనుగొండ, ఉప్పరపల్లి గ్రామాల్లో నిర్మించిన రైతువేదిక భవనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం 131 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల, పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పంట పెట్టుబడికి ఎకరానికి రూ.10వేలు, రైతుబీమా ద్వా రా రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, 24 గంటల విద్యుత్ సరఫరా, మద్దతు ధర వంటి పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచాడన్నారు. త్వరలోనే యా సంగి పంటకు సంబంధించిన డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు వెంటనే రైతుబంధు, రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకే రైతువేదికలు నిర్మించామని, రైతు వేదికలలో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం కల్యాణ లక్ష్మి ద్వారా రూ.100,116, అమ్మ ఒడి, బాలింతలకు కేసీఆర్ కిట్టుతో పాటు రూ.12 వేల ఆర్థిక సహాయం, పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాచర్ల నిర్మల, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మాచర్ల రమేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దామరకొండప్రవీణ్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నజీర్ ఆహ్మద్, వైస్ ఎంపీపీ నవీన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మర్రి నారాయణ్‌రావు, భట్టు శ్రీనివాస్, కముటం శ్రీను, చిర్ర యాకాంతంగౌడ్, ఘనపారపు రమేశ్, సంకు శ్రీనివాస్‌రెడ్డి, డీఎంవో ఛత్రునాయక్, తహసీల్దార్ మాదవపెద్ది వెంకట్‌రెడ్డి , మోడెం రవీందర్‌గౌడ్, లింగాల పిచ్చయ్య తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- పూరీ తనయుడు మరింత రొమాంటిక్‌గా ఉన్నాడే..!
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర