శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Dec 20, 2020 , 01:48:16

శరవేగంగా మోడల్‌ మార్కెట్‌ పనులు

శరవేగంగా మోడల్‌ మార్కెట్‌ పనులు

  • పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌ 19 : జిల్లా కేంద్రంలో మోడల్‌ కూరగాయల మార్కెట్‌, రైతుబజార్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అమ్మబావి కూరగాయల మార్కెట్‌లో పార్కింగ్‌, వ్యాపారులకు సరైన వసతులు, స్థలం లేకపోవడంతో రోడ్లపై అమ్మకాలు జరుగుతున్నందున ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతున్నది. వీటిని దృష్టిలో ఉంచుకొని గత ఎన్నికల్లో ఇచ్చిన మేరకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హన్మకొండకు వెళ్లే ప్రధాన రహదారి సమీపంలోని దయానిలయం వద్ద విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా రైతులు, వ్యాపారులు, పట్టణ, గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. జనగామకు ఐకాన్‌గా మార్కెట్‌ నిర్మాణం ఉండాలనే దృష్టితో ఎమ్మెల్యే ఇప్పటికే పలుమార్లు పనులను సందర్శించి కాంట్రాక్టర్‌కు సూచనలు చేసి, దగ్గరుండి పనులు జరిపించారు. ప్రస్తుతం పుటింగ్‌, సెంట్రింగ్‌ పనులు పూర్తి చేసుకున్న కూరగాయల మార్కెట్‌ భవనానికి శనివారం స్లాబ్‌ వేస్తుండగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వెంట పలువురు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. 

VIDEOS

logo