ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 19, 2020 , 02:08:45

డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా- డ్రైవర్‌కు గాయాలు

డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా- డ్రైవర్‌కు గాయాలు

రఘునాథపల్లి, డిసెంబర్‌ 18 : డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడి డ్రైవర్‌కు గా యాలైన ఘటన మండలంలోని నిడిగొండ బస్టాండ్‌ వద్ద హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు డీజల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ నిడిగొండ బస్టాండ్‌ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్‌ బోల్తా కొట్టడడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమి త్తం జనగామ ఏరియా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి  చేరుకుని ఫోమ్‌వాటర్‌ను డీజిల్‌పై చల్లారు. 

VIDEOS

logo