ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Dec 19, 2020 , 02:08:47

ధరావత్‌ తండాలో అధికారుల పర్యటన

ధరావత్‌ తండాలో అధికారుల పర్యటన

దేవరుప్పుల, డిసెంబర్‌ 18: విలేజ్‌ విజిట్‌లో భాగంగా శుక్రవారం అధికారుల బృందం ధరావత్‌ తండాలో పర్యటించి పల్లెప్రగతి పనుల ను పరిశీలించింది. మండల ప్రత్యేకాధికారి, డీపీఎం కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సర్పం చ్‌ గేమానాయక్‌ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పనుల పురోగతి, పెండింగ్‌ బిల్లుపై చర్చించారు. రూ.9లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉండగా తాత్కాలిక పద్దు కింద జీపీ నిధుల నుంచి చెల్లించాలని అధికారులు సర్పంచ్‌కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వర్‌, ఏపీవో శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఉపసర్పంచ్‌ మంగ్త్యా, వార్డు సభ్యులు యాదానాయక్‌, పంప్లి, లాలమ్మ, కారోబార్‌ బిక్కునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo