ప్రగతి వైపు పల్లెలు

- గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుధ్య పనులు
- శుభ్రమవుతున్న కాలనీలు
- సీజనల్ వ్యాధులకు చెక్
- నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు
- ఫలితాలిస్తున్న ‘పల్లె ప్రగతి’
పాలకుర్తి, డిసెంబర్18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ఫలితాలు ఇస్తున్నది. గ్రామ పంచాయతీల్లో చెత్త పేరుకుపోకుండా ట్రాక్టర్ అందించి చెత్తను తరలించేలా చర్యలు తీసుకున్నది. దీనికి తోడు ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా అధికారులు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఇలా సేకరించిన చెత్తను పంచాయతీ ట్రాక్టర్లలో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో వేసిన చెత్తతో సేంద్రియ ఎరువు తయా రు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
నిత్యం పారిశుధ్య పనులు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మురుగు కాల్వలను శు భ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కరోనా ప్రభావం ఉన్న గ్రామాల్లోనూ హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. దీనికి తోడు దోమలు వృద్ధి చెందకుండా రాత్రి వేళ గ్రామాల్లోని పలు వీధుల్లో ఫాగింగ్ చేయిస్తు న్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
డంప్యార్డుల నిర్మాణం
మండలంలో ప్రతి గ్రామపంచాయతీలో డంపింగ్ యార్డులు నిర్మిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో సగానికి పైగా పనులు పూర్తి చేశారు. చెత్తను సేకరించేందుకు ప్రభు త్వం ప్రతి జీపీకి ట్రాక్టర్ను అందజేయడంతో అందులోనే డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గతంలో ఎక్కడపడితే అక్కడ కనిపించిన చెత్త కుప్పలు ప్రస్తుతం డంపింగ్ యార్డు కు చేరుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో పల్లెలు శుభ్రంగా మారుతున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు బాహాటంగానే పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!