సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు

- పేదింటికి పెద్దన్న సీఎం కేసీఆర్
- ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి,
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు,
- లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
జనగామ, నమస్తేతెలంగాణ, డిసెంబర్ 18: సబ్బం డ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలంగాణ సర్కార్ సర్వమతాలను గౌరవిస్తూ వాటికి సముచిత స్థానం కల్పిస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం జనగామలో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్ లు, పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వేర్వేరు కార్యక్రమాల్లో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను పేదలు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్టుగానే రంజాన్, క్రిస్మస్ పండుగలకూ దుస్తులు అందిస్తున్నట్లు చెప్పారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న సుమారు 3వేల కుటుంబాలకు ప్యాక్‌లు పంపిణీ చేస్తుండగా, జనగామ నియోజకవర్గంలోనే వేయి కుటుంబాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారని అన్నారు. క్రైస్తవులకు కేటాయించిన రెండెకరాల స్థలాన్ని త్వరలోనే అందజేస్తామని చెప్పారు. కేసీఆర్ పాలన జనరంజకంగా ఉంటే బీజేపీ మాత్రం వక్రబుద్ధితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీవో మధుమోహన్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున లింగయ్య, తహసీల్దార్ రవీందర్, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, పాస్టర్లు చిట్టిబాబు, దేవసహాయం, మోజెస్, నర్సింగరావు, కృపానందం, సంజీవ్, రవి, ఫిలిప్, పాల్రాజు, శాంసన్, మార్కెట్ చైర్పర్సన్ బల్దె విజయ, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, తరిగొప్పులు ఎంపీపీపీ హరిత, జడ్పీటీసీ పద్మజ, కౌన్సిలర్లు సమద్, వాంకుడోత్ అనిత, శారద, కర్రె శ్రీనివాస్, సుధా, గుర్రం భూలక్ష్మి, జూకంటి లక్ష్మి, బండ పద్మ, నాయకులు రావెల రవి, మామిడాల రాజు, లెనిన్ పాల్గొన్నారు.
రూ.44.05 లక్షల చెక్కులు పంపిణీ
పేదింటికి పెద్దన్నగా ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి రూ.లక్షా నూట పదహారు అందిస్తున్న సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 46 మంది లబ్ధిదారులకు రూ.44.05 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హమీద్, సర్పంచ్ శ్రీలత, ఎంపీపీ కళింగరాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్‌తో పాదయాత్ర
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్‌కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
- మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
- ఆ సినిమాలో నా రోల్ చూసి నాన్న చప్పట్లు కొట్టాడు: విద్యాబాలన్
- విడుదలకు ముస్తాబవుతున్న 'బజార్ రౌడి'
- కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి