సోమవారం 01 మార్చి 2021
Jangaon - Dec 18, 2020 , 03:41:26

19న పాలకుర్తి దేవస్థాన హుండీల లెక్కింపు

19న పాలకుర్తి దేవస్థాన హుండీల లెక్కింపు

పాలకుర్తి, డిసెంబర్‌17: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల లెక్కింపు ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు ఈవో మేకల వీరస్వామి తెలిపారు. గురువారం దేవస్థాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాదాయ శాఖ వరంగల్‌ సహాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు హుండీల లెక్కింపు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు పాల్గొనాలని వీరస్వామి కోరారు.


VIDEOS

logo