మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Dec 18, 2020 , 03:45:47

దేవాదుల ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు

దేవాదుల ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు

  • నవాబుపేట రిజర్వాయర్‌తో సస్యశ్యామలం 
  •  82 చెరువులకు నీటి విడుదల
  • సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ 
  • డిప్యూటీ డైరెక్టర్‌ రేఖారాణి

లింగాలఘనపురం, డిసెంబరు 17 : నవాబుపేటలోని దేవాదుల రిజర్వాయర్‌ ద్వారా ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు 30 వేల ఎకరాలకు గోదావరి జలాలను సాగు నీటికి అందించామని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రేఖారాణి తెలిపారు. మండలంలోని నవాబుపేట రిజర్వాయర్‌ను గురువారం ఆమె సందర్శించారు. రిర్వాయర్‌ నుంచి ఏఏ మండలాల్లోని గ్రామాలకు సాగు నీటిని అందించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

రేఖారాణి మాట్లాడుతూ లింగాలఘనపురం, దేవరుప్పుల మండలాలతోపాటు యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల, మోత్కూరు మండలాల్లోని 82 చెరువులకు ఈ రిజర్వాయర్‌ ద్వారా సాగునీరు అందించామన్నారు. ప్రతి రోజూ 350 క్యూసెక్కుల నీటిని ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు సరఫరా చేయడంతో సాగునీటి సమస్య తీరిందని రేఖారాణి పేర్కొన్నారు. నవాబుపేట రిజర్వాయర్‌ సామర్థ్యం 0.5 టీఎంసీ కాగా 12 వేల క్యూసెక్కుల నీటిని సాగునీటిగా సరఫరా చేశామన్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి సాగు నీరందక వేలాది ఎకరాల భూములు బీళ్లుగా మారాయన్నారు. నేడు ఈ నాలుగు మండలాల్ల్లో ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం ఉట్టి పడుతున్నదని ఆమె వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అధికారుల కృషితో సత్ఫలితాలు వచ్చాయని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వీవీఎస్‌ఎన్‌ మూర్తి, ఈఈ విజయకుమార్‌, డీఈ వెంకటకృష్ణారావు, ఏఈ సునిల్‌కుమార్‌, ప్రాజెక్టు మేనేజర్‌ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.  


VIDEOS

logo