Jangaon
- Dec 18, 2020 , 03:41:22
VIDEOS
నేడు జనగామలో క్రిస్మస్ కానుకల పంపిణీ

జనగామ క్రైం, డిసెంబర్ 17 : పేద క్రైస్తవులకు సర్కారు పంపిన క్రిస్మస్ కానుకలను శుక్రవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేస్తారని తహసీల్దార్ రవీందర్ తెలిపారు. గురువారం ఆయనొక ప్రకటన చేశారు. జనగామ మండలానికి చెందిన 42 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారని రవీందర్ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న యూనిక్ చర్చిలో జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలకు చెందిన పేద క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పంపిణీ చేస్తారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING