రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుదాం

- జనగామ వ్యవసాయ మార్కెట్
- చైర్పర్సన్ బాల్దె విజయ
జనగామ, నమస్తేతెలంగాణ, డిసెంబర్ 16 : జనగామ వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుదామని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బాల్దె విజయసిద్ధిలింగం అన్నారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తొలి పాలక వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం ప్రపంచంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌తోపాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో సర్కారు చేస్తున్న కృషిని ఆమె వివరించారు. కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలను జనగామకు తెప్పించిన ఘనత ముత్తిరెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యంగా పాలక వర్గ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ జనగామ మార్కెట్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్‌గా తీర్చి దిద్దేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు నూనెముంతల యాకస్వామి, చిన్నం నర్సింహులు, బుశిగంపల ఆంజనేయులు, దండిగ మహేశ్, బూడిద రాజు, కొడిడెటి శంకర్, మాశెట్టి వెంకటేశ్వర్లు, మాశెట్టి అశోక్, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్‌శర్మ, కార్యదర్శి జీవన్‌కుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!