గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 17, 2020 , 00:27:11

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

  • జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి

బచ్చన్నపేట, డిసెంబర్‌ 16 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్‌ఎఫ్‌ పథకం నిరుపేదలకు వరంగా ఉందని జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని గోపాల్‌నగర్‌కు చెందిన కడకంచి యాదగిరికి రూ,60 వేలు, బొమ్మ లక్ష్మి రూ.10 వేలు, ఏలూరి సిద్ధ్దారెడ్డికి రూ.10 వేల చెక్కులను సర్పంచ్‌ పర్వతం మధుప్రసాద్‌తో కలిసి ఆమె అందించారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్‌ ఉపయోగపడుతున్నదన్నారు. జనగామ నియోజకవర్గంలోని పేదలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శాసనమండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు సహకారంతో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి నిధు లు మంజూరు చేయించడం హర్షణీయమన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆరోపణలు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కనకయ్యగౌడ్‌,  మండల కోఆప్షన్‌ సభ్యుడు షబ్బీర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గంధమల్ల నరేందర్‌, బొమ్మ నర్సింహులు పాల్గొన్నారు. 


VIDEOS

logo