రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

- కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక
- విధానాలను ప్రజలు తిప్పికొట్టాలి
- జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
నర్మెట, డిసెంబర్ 16 : ఆరుకాలం కష్టపడి పంటలు పండించే రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు మచ్చుపహాడ్, వెల్దండ, హన్మంతాపూర్ క్లస్టర్ల రైతు వేదికలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే రైతులను గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు. సీజన్‌కు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు రైతులు ఏఏ పంటలు సాగు చేయాలనే విషయాలను చర్చించుకునేందుకు ఏర్పాటు చేసినవే రైతు వేదికలని ఆయన అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. పంటల పెట్టుబడికి ఎకరాకు ఏడాదిలో రూ.10 వేలు ఇవ్వడంతోపాటు రైతుబీమా పథకంలో రూ.5 లక్షలు అందిస్తున్న సీఎం కేసీఆర్ రైతుబాంధవుడన్నారు. మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ కితాబుచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధిని ఓర్వలేని బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ముత్తిరెడ్డి విమర్శించారు. కేంద్రం రాష్ర్టానికి నిధులు ఇవ్వకున్నా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే రాష్ర్టానికి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. హన్మంతాపూర్ గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని గత ప్రభుత్వాలు విమర్శించాయని, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పనులు చేపట్టిందని గుర్తు చేశారు. తన ఓటు జనగామ నియోజకవర్గంలోని హన్మంతాపూర్లోనే ఉండేలా దరఖాస్తు చేసుకుంటానని ముత్తిరెడ్డి వివరించారు. ఇక్కడే ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని అన్నారు. ఇదిలా ఉండగా హన్మంతాపూర్-నర్మెట గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటేందుకు కాల్వ తీయాలని ఎంపీడీవోను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ చింతకింది సురేశ్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మంకెన ఆగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కల్యాణం మురళి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, సర్పంచ్‌లు రామిని శివరాజ్, పగడాల విజయనర్సయ్య, భూక్య నీల, కిరణ్, బానోత్ అనిత, జాల శ్వేత కిషన్, శ్రీనివాస్, బానోత్ శంకర్‌నాయక్, రజిత రవి, నర్ర వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీలు బానోత్ లలితాసోమ్లనాయక్, ముక్కెర యాదమ్మ, పీఏసీఎస్ ఛైర్మన్ కేతిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గట్టయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్‌రెడ్డి, నాయకులు కంతి రాజలింగం, పిట్టల రాజు, నరహరి, పెద్ది రత్నాకర్‌రెడ్డి, పండుగ మల్లేశం, నక్కల రవి, గడపురం శశిరథ్, గోపగోని రామకృష్ణ, బండి రాము, కొర్ర రాజ్‌కుమార్, చేర్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాక్ క్రికెటర్ అక్మల్‌కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు