గురువారం 04 మార్చి 2021
Jangaon - Dec 15, 2020 , 04:09:47

పశు సంరక్షణకు సర్కారు కృషి

పశు సంరక్షణకు సర్కారు  కృషి

పాలకుర్తి రూరల్‌/జనగామ రూరల్‌/లింగాలఘనపురం: పశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ నల్లానాగిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు హరిజన కాలనీ, చెన్నూరు గ్రామాల్లో జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావుతో కలిసి పశువులకు నట్టల నివారణ మందు వేశారు. అనంతరం నూతన పశువుల బోనును ప్రారంభించారు. కార్యక్రమంలో పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, సర్పంచ్‌లు వీరమనేని యాకాంతారావు, యాకయ్య, బుర్క కుమార్‌, పుస్కూరి పార్వతి రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీలు పుస్కూరి కళింగరావు, ఎడవెల్లి పురుష్తోం, మాటూరి యాకయ్య, వైద్యాధికారులు ఎన్‌ సతీశ్‌, నరేశ్‌ పాల్గొన్నారు. జనగామ మండలం పెంబర్తి, వెంకిర్యాల, ఓబుల్‌కేశ్వాపూర్‌ గ్రామాల్లో పశువులకు నట్టల నివారణ వేశారు. కార్యక్రమంలో ఏడీ నర్సయ్య, సర్పంచులు అంబాల ఆంజనేయులు, కీర్తి లక్ష్మీనర్సయ్య, రేణుక, ఎంపీటీసీ మూల రవి, మండల పశువైద్యుడు రాజశేఖర్‌, జేవీవో హాఫీజ్‌ పాల్గొన్నారు. లింగాలఘనపురం మండలం వనపర్తి, కళ్లెం గ్రామాల్లో పశువులకు నట్టల మందు పంపిణీచేసినట్లు మండల పశువైద్యాధికారి అనిత తెలిపారు. సర్పంచ్‌ ఉంగరాల శ్రీధర్‌, డాక్టరు భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు. కళ్లెంలో డాక్టరు మాళవిక ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

జఫర్‌గఢ్‌ మండల తమ్మడపల్లి(ఐ)లో పశువైద్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం గేదెలు, ఆవులకు నట్టల నివారణ నివారణ మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ రడపాక సుదర్శన్‌, సర్పంచ్‌ గాదెపాక అనిత ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఉప్పుగల్లు పశువైద్యాధికారి గైని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ నెల 23 వరకు నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. తమ్మపల్లి(ఐ)లో నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని రాష్ట్ర మానిటరింగ్‌ అధికారి రవి కుమార్‌ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సిబ్బంది సురేశ్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo