Jangaon
- Dec 14, 2020 , 04:42:08
VIDEOS
ధరణి మహిళా సంఘం చేయూత

బచ్చన్నపేట, డిసెంబర్ 13 : ధరణి మహిళా సంఘం సభ్యురాలు మృతి చెందగా బాధిత కుటుంబాన్ని సంఘం ఆధ్వర్యంలో ఆదుకోవడం అభినందనీయమని నారాయణపూర్ సర్పంచ్ మాసపేట రవీందర్రెడ్డి అన్నారు. ఆదివారం ధరణి మహిళా సంఘం సభ్యురాలు బదికె సిద్దమ్మ రెండు నెలల క్రితం మృతి చెందగా ఆ సంఘం ఆధ్వర్యంలో మరణవిపత్తు సాయం కింద రూ.8 వేలు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సంఘంలో పొదుపు చెల్లిస్తూ అకాల మరణం చెందిన సభ్యులకు సంఘం చేయూతనివ్వడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సీఈవో పన్నీరు సత్యం, పాలక వర్గం సభ్యురాలు మహేశ్వరీ, సూపర్వైజర్ శ్రీనివాస్, రమాదేవి, సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING