ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 14, 2020 , 04:42:08

మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌కు సన్మానం

మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌కు సన్మానం

జనగామ రూరల్‌, డిసెంబర్‌13: నూతనంగా బాధ్యతలు చేపట్టిన జనగామ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బాల్దె విజయ సిద్దిలింగంను పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం సన్మానించారు. మండలంలోని పెంబర్తికి చెందిన టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ ఎండీ. రజాక్‌, టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు సంకటి నాగార్జున, గంగరబోయిన నాగరాజు, ఎండీ, అష్హు, వివిధ గ్రామాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభియానులు వచ్చి నూతన చైర్‌ పర్సన్‌ను సన్మానించి శుభాక్షాంక్షలు తెలిపారు. 


VIDEOS

logo