Jangaon
- Dec 14, 2020 , 04:42:08
VIDEOS
గుర్తుతెలియని వాహనం ఢీ: ఒకరి మృతి

జనగామ రూరల్, డిసెంబర్13: జిల్లా కేంద్రానికి సమీసంలోని పెంబర్తి వై జంక్షన్ వద్ద తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లిన చందా సింగ్ (40) గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
జనగామ జిల్లా కేంద్రాంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన చందాసింగ్ తెల్లవారుజామున వాకింగ్ వెళ్లాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మృతుడి చిననాన్న టాక్ చరణ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
MOST READ
TRENDING