అధికారుల గైర్హాజరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

- రైతుబీమాలో మండల సభలో నిలదీత
బచ్చన్నపేట, డిసెంబర్ 11 : సంక్షేమ కార్యక్రమాల అమలులో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమేగాక మండల సభకు హాజరుకాకపోవడంపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సభకు ముఖ్యఅతిథిగా జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మీఅంజయ్య, ఎంపీడీవో రఘురామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరయ్యారు. మండలంలో చేపపిల్లల పంపిణీపై తమకు సమాచారం ఇవ్వడం లేదని వీఎస్ఆర్ నగర్ సర్పంచ్ స్వామి సంబంధిత అధికారిని ప్రశ్నించారు. బసిరెడ్డిపల్లి, గంగాపూర్ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్, ఎంపీటీసీలు పరశురాములు, మసూద్ సభ దృష్టికి తెచ్చారు. బచ్చన్నపేట బస్టాండ్ ఆవరణలో పారిశుధ్య పనులు చేయించేందుకు సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ మల్లారెడ్డి ఆర్టీసీ అధికారి యాదగిరికి సూచించారు.
అంగన్వాడీ కేంద్రాలకు ఏమేమి సరుకులు వస్తున్నాయో సమాచారం ఇవ్వడంలేదని. కొన్ని కేంద్రాలను తెరవడం లేదని పలువురు సర్పంచ్‌లు ఆరోపించారు. దీనిపై సీడీపీవో విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్నరామన్‌చర్లలో రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్నా సంబంధిత అధికారులు బీమా చేయలేదని, దీంతో సదరు రైతు ఇటీవల మృతి చెందగా విషయం వెల్లడైందని సర్పం చ్, ఎంపీటీసీ సభ దృష్టికి తెచ్చి ఏవోను నిలదీశారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది పనులకు సహకారం అందించాల్సిం ది పోయి పలువురు ప్రజాప్రతినిధులు వెనుక ఉండి ఇతరులతో ఆర్టీఐ చట్టం పేర సమాచారం చెప్పాలంటూ వేధిస్తున్నారని సర్పంచ్‌లు సతీశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, లక్ష్మి తదితరులు ఆరోపించారు. పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేయకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. మేము సర్పంచ్లమా...
లేక కాంట్రాక్టర్లమా అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానవాటిక పనులు ప్రారంభించని సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేశారని అన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించి బిల్లులు వెంటనే చెల్లించాలని ఎంపీటీసీ మసూద్ డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే తనపై కావాలని కక్ష సాధిస్తున్నారని రామచంద్రాపూర్ సర్పంచ్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం జ్యోతి, ఏవో అనిల్, ఏఈలు శ్రీనివాస్, అరుణారెడ్డి, ఈసీ మోహన్, సూపరింటెండెంట్ మాధవి, డీటీ విమల తదితరులు పాల్గొన్నారు. కాగా సభకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ తీర్మానించింది.
తాజావార్తలు
- 13 మంది ట్రాన్స్‌జెండర్స్ కానిస్టేబుల్స్‌గా నియామకం
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు
- పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించండి: టీటీడీ ఈవో
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు
- శృంగారానికి ముందు వీటిని అస్సలు తినకండి..!
- అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
- ఏపీలో తగ్గిన కరోనా కేసులు