సోమవారం 01 మార్చి 2021
Jangaon - Dec 12, 2020 , 03:53:14

మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయకు అభినందనలు

మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయకు అభినందనలు

జనగామ రూరల్‌, డిసెంబర్‌ 11: జనగామ వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా నియమించబడిన మండలంలోని పెంబర్తికి చెందిన బాల్దె విజయకు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు అభినందనలు తెలిపారు. మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా శుక్రవారం ఆమె ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లగా పెంబర్తి నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ భూరెడ్డి ప్రమోద్‌ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారద స్వామి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అంబాల ఆంజనేయులు, బానోత్‌ జయరాం తేజావత్‌ కల్యాణి, మూల రవి, పార్టీ గ్రామ అధ్యక్షులు చినబోయిన నర్సయ్య, మడిపల్లి సుధాకర్‌గౌడ్‌, నాయకులు బనుక భిక్షపతి, దండు సత్యనారాయణ, గుజ్జుల సంపత్‌, రజాక్‌, చంద్రయ్య తదితరులు ఉన్నారు. 


VIDEOS

logo