మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా..

- పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేర్చాలి
- 18 నుంచి 55 ఏళ్లలోపువారికి అవకాశం
- జిల్లా వ్యాప్తంగా సెర్ఫ్ సర్వే
- పేదరిక నిర్మూలనకు సర్కారు చేయూత
దేవరుప్పుల, డిసెంబర్ 11 : దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. పల్లెలు, పట్టణాల్లో మరిన్ని మహిళా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు నిశ్చయించింది. ఇప్పటికే మహిళా సంఘాల్లోని సభ్యుల్లో కొందరు స్వయం ఉపాధి పథకాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇంకా అనేక మంది ఆర్థికంగా నిలదొక్కులేని విషయాన్ని పేదరిక నిర్మూలనా సంస్ధ గుర్తించి వారికి చేయూతనందించేందుకు సంకల్పించింది. అందులో భాగంగా జిల్లాలో అర్హత గల ప్రతి మహిళలను పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేర్చేందుకు చర్యలు చేపట్టింది.
జిల్లాలో పొదుపు సంఘాలు ఇలా..
జిల్లాలోని 12 మండలాల్లో 455 గ్రామైక్య సంఘాలుండగా, 10,425 పొదుపు సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో 1,19,190 మంది సభ్యులున్నారు. ప్రతి సంఘంలో 10 మందికి మించకుండా సభ్యులు ఉన్నారు. 114 సంఘాల్లో 10 మందికి తక్కువ సభ్యులుండడంతో ఈ స్పెషల్ డ్రైవ్‌లో కొత్తవారికి భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అవసరమైతే మరిన్ని సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల్లో ఓటరు జాబితా వారీగా చూస్తే 20 వేల మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా లేరు. వీరిలో విద్యార్థులు, 55 ఏళ్లపై పడిన మహిళలను మినహాయిస్తే మిగిలిన వారిని పొదుపు సంఘాల్లో చేరేలా ప్రోత్సహించాలని పేదరిక నిర్మూలన సంస్థ సర్వే టీమ్‌కు తెలిపింది.
అర్హతగల పతి మహిళకూ సభ్యత్వం..
జిల్లాలో అర్హత ఉన్న ప్రతి మహిళకూ పొదుపు సంఘాల్లో సభ్యత్యం ఇచ్చే దిశలో పేదరిక నిర్మాలన సంస్థ కార్యాచరణ చేపట్టింది. ఇందుకుగాను ఐకేపీ సీసీలు, వీవోఏలు ఓటరు లిస్ట్‌తో ఇంటింటి సర్వే నిర్వహించాలి. ఓటరు లిస్ట్‌లో పేరుండి 15 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళను పొదుపు సంఘంలో ఉండేలా చూడాల్సి బాధ్యతను అప్పజెప్పారు. ఇక ఇందులో విద్యార్థులు, వలసవెళ్లిన వారిని, స్ధానికంగా ఉండని వారని, వయో వృద్ధులను తొలగించి, మిగితా వారిని పొదుపు సంఘంలో సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలి.
ఆర్ధికంగా దెబ్బతిన్న వారికి బాసట..
కొత్తగా సభ్యత్వం తీసుకున్న మహిళల్లో ఆర్థికంగా చితికి పోయిన కుటుంబాలుంటే వారికి వెంటనే రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తారు. ఇందుకోసం బ్యాంక్ లిం కేజీ రుణాలు, ఎస్సీ, ఎస్టీ, నిథు లు, సీఐఎఫ్ (కమ్యూనిటీ ఇన్వెవెస్ట్ మెంట్ ఫండ్)నిధులు, స్త్రీ నిధి రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పన : రాంరెడ్డి, డీఆర్డీవో
మహిళాభ్యున్నతే లక్ష్యంగా పేదరిక నిర్మూలనా సంస్ధ పనిచేస్తుంది. దశాబ్దాల తరబడి గ్రామాల్లో వేలాది మంది మహిళలు గ్రూపులుగా ఏర్పడి ఆర్థికంగా ఎదిగారు. కుటుంబంలో మహిళ చేతిలో డబ్బుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది. సంఘాల ద్వారా మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించాం. గొర్రెల పెంపకం, డైరీ, చిరు వ్యాపారాలు, టైలరింగ్, చేనేతలాంటి అనేక పరిశ్రమలకు రుణాలందించగా అనేక కుటుంబాలు బాగుపడ్డయి. ఈ సంఘంలో సభ్యత్వం లేక పేదరికంతో మగ్గుతున్న కుటుంబాల మహిళలను ఆర్దికంగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాం. అందులో భాగంగానే గ్రామాల్లో ఓటరు లిస్ట్ వారీగా సర్వే చేసి అర్హత ఉండి పొదుపు సంఘంలో సభ్యత్వం లేని వారిని గుర్తించి ఆర్థికంగా ప్రోహించాలనేదే మా సంకల్పం.
తాజావార్తలు
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
- నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన