శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 11, 2020 , 04:07:07

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు ఆహ్వానం

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు ఆహ్వానం

జనగామ క్రైం, డిసెంబర్‌ 10 : ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్‌లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు వచ్చే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో యాదయ్య తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలైన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని డీఈవో సూచించారు. ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు పైన తెలిపిన అధికారులను మాత్రమే సంప్రదించాలి తప్ప మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఫీజుతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు మీ సేవ/ టీఎస్‌ ఆన్‌లైన్‌/ ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాలను సంప్రదించి నామ మాత్రపు ఫీజు చెల్లించాలని యాదయ్య పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం మూరల శంకర్‌రావు, జిల్లా కోఆర్డినేటర్‌, సెల్‌ నంబర్‌ 80084 03631ను సంప్రదించాలని లేదా ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌ www. telanganaopenschool.org లో చూడాలని కోరారు.


VIDEOS

logo