ప్రగతి బాటలో జనగామ

- స్వరాష్ట్రంలో మెరుగైన ‘పుర’పాలన
- పట్టణాభివృద్ధికి విరివిగా సర్కారు నిధులు
- రూ.120 కోట్లతో అండర్ డ్రైనేజీ పనులకు ప్రతిపాదన
- రూ.3.50కోట్లతో మున్సిపల్ ఆడిటోరియం..
జనగామ, నమస్తే తెలంగాణ : సీమాంధ్ర పాలనలో గ్రాంట్లు, జనాభా నిష్పత్తితో నిధుల పంపకంపై ఆధారపడి సాగిన పుర‘పాలన’కు స్వరాష్ట్రంలో మహర్దశ పట్టింది. రెండో గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న జనగామ పట్టణాభివృద్ధికి మునుపటి కంటే అధిక నిధులు మంజూరవుతున్నాయి. ఆస్తిపన్ను వసూళ్లు, బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ వంటి సొంత ఆదాయంతో కొంత ఆర్థిక పరిపుష్టి సాధించుకున్న బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివిధ పథకాల కింద రూ. కోట్లాది నిధులు విడుదలవుతున్నాయి.
పట్టణంలో అండర్‌డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.120 కోట్లు, బల్దియా కార్యాలయం ఆవరణలో ఆధునిక హంగులతో రూ.3.50కోట్లతో మున్సిపల్ ఆడిటోరియం నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. ఇంటింటికీ శుద్ధినీరు అందించేందుకు ఆధునీకరణ పనులకు రూ.2.16 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ధర్మకంచలో రూ. 2 కోట్లతో మినీస్టేడియం, ఇండోర్ స్టేడియాలను నిర్మించారు. భవిష్యత్‌లో జనగామ పట్టణాన్ని గ్రేడ్-1 పురపాలక సంఘంగా, స్పెషల్ గ్రేడ్, కార్పొరేషన్ రూపు సంతరించుకునే దిశగా శామీర్‌పేట, యశ్వంతాపూర్, పెంబర్తి, నెల్లుట్ల వంటి గ్రామాలను పూర్తిస్థాయిలో మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదన సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రూ.2.50 కోట్లతో రైతుబజార్ కూరగాయల మార్కెట్ యార్డు, రూ.2 కోట్లతో చంపక్‌హిల్స్ డంపింగ్‌యార్డు పనులు జరుగుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.46 కోట్లతో సీసీరోడ్లను తారురోడ్లుగా మార్చే ప్రక్రియ పూర్తయింది.
కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపేణ ప్రతి ఏటా మంజూరు చేసే నిధుల్లోంచి 70 శాతం తాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీలకు, మరో 30 శాతం పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తున్నారు. పట్టణ ప్రగతి నిధులతో ఐదేళ్లలో జనగామను సుందర పట్టణంగా తీర్చిదిద్దుకోవచ్చని పాలకవర్గం ప్రతిపాదించింది. ఈ ఏడాది రూ.3కోట్ల 46లక్షల 70వేలను 14 ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు విడుదల చేయడంతో పలు రోడ్లు కొత్తరూపును సంతరించుకున్నాయి.
ప్రధాన కూడళ్ల సుందరీకరణకు ప్రతిపాదన
జనగామ పట్టణంలోని జంక్షన్లు, ప్రధాన, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించారు. ఆర్టీసీ చౌరస్తాను, హైవే జంక్షన్‌ను సూర్యాపేట రోడ్డులో ఎన్ఎంఆర్ గార్డెన్ వరకు విస్తరించి ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు 14వ ఆర్థిక సంఘం, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు ఖర్చు చేయనున్నారు.
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు