శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 09, 2020 , 04:08:11

కేంద్రం తీరుపై రైతుల కన్నెర్ర

కేంద్రం తీరుపై రైతుల కన్నెర్ర

  • జిల్లా కేంద్రానికి ట్రాక్టర్లతో తరలివచ్చి నిరసన
  • మద్దతు పలికిన టీఆర్‌ఎస్‌
  • ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  • అంబేద్కర్‌ విగ్రహం వద్ద్డ పాదాభివందనం
  • కేంద్రంపై కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాల నిరసన
  • మద్దతు పలికిన రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాలు
  • జిల్లాలో భారత్‌బంద్‌ విజయవంతం

జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌ 8 : కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ము కాసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతుగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం, సీపీఐ, రైతు, ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య, ఉద్యోగ, కార్మిక సంఘాలు చేయిచేయి కలిపి కదంతొక్కాయి. రైతుల నోట్లో మట్టి కొట్టి దళారులు, వ్యాపారులకు మేలు చేసేలా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసించాయి. భారతీయ కిసాన్‌ యూనియన్‌ తలపెట్టిన భారత్‌ బంద్‌లో పాల్గొనాలన్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, అర్ధనగ్న ప్రదర్శనలతో హోరెత్తించారు. జనగామలో ఆర్‌అండ్‌బీ అతిధిగృహం నుంచి వేలాది మంది రైతులతో టీఆర్‌ఎస్‌ భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రైతు వేషధారణలో తలపాగా చుట్టి ట్రాక్టర్‌ నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కేంద్రంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు వేర్వేరుగా ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలతో నిరసన తెలిపాయి. వరంగల్‌-హైదరాబాద్‌ హైవేపై టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి సుమారు రెండు గంటల పాటు కేంద్రం తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అంబేద్కర్‌ విగ్రహం పాదాలకు నమస్కరించి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.  

రైతు జోలికి వస్తే ఊరుకోం : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

దేశానికి పట్టెడన్నంపెట్టే అన్నదాతను ఉన్నతస్థితిలో చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక పథకాలతో బాసటగా నిలిస్తే కేం ద్రం నూతన వ్యవసాయ చట్టాల పేరుతో నడ్డివిరిచేందుకు యత్నిస్తోందని జన గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. రైతు జోలికి వస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. భారత్‌బంద్‌లో భాగంగా రైతులకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మారుస్తుంటే రైతులను నష్టపర్చేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తున్నదన్నారు. రైతును ఏడిపించిన ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే వరకు జరిగే పోరాటానికి టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీమాంధ్ర పాలనలో దోపిడీకి గురైన తెలంగాణలో కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుకు రెండు పంటలకు నీరందించేలా కేసీఆర్‌ సర్కార్‌ నిమగ్నమైతే అన్నంపెట్టే రైతుకు అన్యాయం చేసేందుకు కేంద్రం నల్లచట్టాలను తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఆమోదించనప్పటికీ సంఖ్యా బలం లేకున్నా కేంద్రం ఏకపక్షంగా బిల్లులు తేవడం ఏమిటని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. మోదీ సర్కారు తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై తెలంగాణ రైతు రణం చేసేందుకు సిద్ధమయ్యాడని స్పష్టం చేశారు. సేవలు ఒప్పందాల బిల్లుతో సొంత పొలంలో రైతు కూలీగా మారి, కార్పొరేట్‌ కంపెనీలు చెప్పినట్లు వినాల్సిన దుస్థితి వస్తుందని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల సవరణ బిల్లుతో భారీ ఎత్తున సరుకులను నిల్వచేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా వ్యాపార సంస్థలకు భారీగా లాభాలు చేకూరి రైతుల బతుకులు బుగ్గిపాలు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, డీసీసీబీ డైరెక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ మేకల కళింగరాజు, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు భూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు శారద, టీఆర్‌ఎస్‌ నాయకులు పసుల ఏబెల్‌, బాల్దె సిద్ధిలింగం, చెంచారపు పల్లవి సోమిరెడ్డి, యాదగిరిగౌడ్‌, బొడిగం చంద్రయ్య, సుదర్శన్‌, కమలాకర్‌రెడ్డి, ఉల్లెంగుల కృష్ణ, పంతుల ప్రభాకర్‌రావు, గుర్రం నాగరాజు, జాయ శ్రీశైలం, వంగ ప్రణీత్‌రెడ్డి, ఉల్లెంగుల నర్సింగ్‌, రాజు, దామెర రాజు, శ్రీశైలం, కొలగాని శ్రీనివాస్‌, విజయ్‌, లెనిన్‌, దిలీప్‌, సతీశ్‌, కౌన్సిలర్లు కర్రె శ్రీనివాస్‌, స్వరూప, అనిత, సుధా సుగుణాకర్‌రాజు, తాళ్ల సురేశ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, జూకంటి లక్ష్మి శ్రీశైలం పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్ల్లో కంచె రాములు, వై.సుధాకర్‌, ఆకుల వేణుగోపాల్‌రావు, ధర్మపురి శ్రీనివాస్‌, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లింగాజీ, శివరాజ్‌, పాండు, లక్ష్మీనారాయణ నాయక్‌, మెడె శ్రీను, మల్లేశం, ప్రభాకర్‌, రాజారెడ్డి, బర్ల శ్రీరాములు, ఇర్రి ఆహల్య, బూడిద గోపి, ప్రకాశ్‌, సాంబరాజు, జనార్ధన్‌, వైకుంఠం, రామిని హరీశ్‌, కొత్తపల్లి సమ్మయ్య, మహేందర్‌గౌడ్‌, సురుగు సతీశ్‌, ఆకుల దుర్గాప్రసాద్‌, పర్కాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నర్మెటలో..

నర్మెట : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండలంలో నిర్వహించిన భారత్‌బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్‌, జడ్పీటీసీ మాలోత్‌ శ్రీనివాస్‌, సీపీఎం, సీపీఐ నాయకులు పాతూరి సుగుణమ్మ, ప్రజ్ఞపురం నర్సింహులు మాట్లాడారు. ప్రధాని విధానాలను నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మను దహ నం చేశారు.  కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కల్యాణం మురళి, వైస్‌ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, బానోత్‌ శంకర్‌నాయక్‌, శ్రీనివాస్‌నాయక్‌, వంగ ప్రణీత్‌రెడ్డి, గుడికందుల నరహరి, కొన్నె చంద్రయ్య, గడపురం శశిరథ్‌, కొండ బాలయ్య, పండుగ మల్లేశం, పిన్నింటి రాజిరెడ్డి, అమర్‌నాథ్‌, కరుణాకర్‌రెడ్డి, కొర్ర రాజ్‌కుమార్‌, పండుగ రాజారాం, గట్టయ్య  పాల్గొన్నారు. 

తరిగొప్పులలో..

తరిగొప్పుల(నర్మెట) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ము కాస్తోందని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్‌, సీపీఎం జిల్లా నాయకుడు రాపర్తి రాజు, మండల కార్యదర్శి పాండ్యాల అంజయ్య విమర్శించారు. మంగళవారం నిర్వహించిన భారత్‌బంద్‌లో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వగలబోయిన యాదగిరి, పండుగ కనకయ్య, యాటేల్ల ప్రభాకర్‌, దామెర థామస్‌, ఎర్రబెల్లి నరేశ్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

బచ్చన్నపేటలో ..

బచ్చన్నపేట : మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు బంద్‌ నిర్వహించారు. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మీఅంజయ్య, ఎంపీపీ నాగజ్యోతీకృష్ణంరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ సంజీవరెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యులు షబ్బీర్‌, పట్టణ అధ్యక్షుడు నరేందర్‌, నాయకులు కృష్ణంరాజు, సర్పంచ్‌లు మల్లారెడ్ది, ఎంపీటీసీలు వేణు, కనకయ్య, మధు, హరికృష్ణ, ఉపేందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సిద్ధులు, సిద్ధిరాంరెడ్డి, జావీద్‌, అజీం, బాలరాజు, గోపి తదితరులు పాల్గొన్నారు.  కాంగ్రెస్‌ నుంచి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహాత్మాచారి, ఎంపీటీసీలు రాధ, పుష్ప, మసూద్‌, నాయకులు భాస్కర్‌, వెంకట్‌రెడ్డి, రమేశ్‌, రాజయ్య, ఎల్లారెడ్డి, నర్సిరెడ్డి, రామకృష్ణ, బుచ్చిరాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో బాపురెడ్డి, వెంకటేశ్‌, రాము, రంగయ్య, శ్రీనివాస్‌, శ్రీరాములు, యాదగిరి, బాలనర్సయ్య  పాల్గొన్నారు.

లింగాలఘనపురంలో..

లింగాలఘనపురం : సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారత్‌బంద్‌ను మండలంలో విజయవంతం చేశారు. నెల్లుట్లలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి, నవాబుపేటలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్‌, వనపర్తిలో జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, సిరిపురంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బస్వగాని శ్రీనివాస్‌ గౌడ్‌, లింగాలఘనపురంలో మాజీ వైస్‌ ఎంపీపీ గవ్వల మల్లేశం అధ్వర్యంలో దుకాణాలను మూయించి బంద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘దిశ’ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, గండి మంగమ్మ యాదగిరి, ఏదునూరి వీరన్న, కేమిడి కవితావెంకటేశ్‌, ఎడ్ల రాజు, కేమిడి యాదగిరి, గట్టగల్ల శ్రీహరి, జాగిళ్లపురం అబ్బులు, గూటం రవి, నాగరాజు  పాల్గొన్నారు.   

రఘునాథపల్లిలో..

రఘునాథపల్లి : వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మండలంలో అఖిలపక్ష పార్టీల నాయకులు బంద్‌ నిర్వహించారు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై బైక్‌ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈజడ్పీటీసీ బొల్లం అజయ్‌కుమార్‌, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్‌, సీపీఎం మండల కార్యదర్శి పొదల నాగరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు ముసిపట్ల విజయ్‌కుమార్‌, లోకుంట్ల సృజన్‌, నామాల బుచ్చయ్య, రేసు కుమార్‌, ఉమ్మగోని ఉప్పలయ్య, గుడి రాంరెడ్డి, సీపీఎం నాయకులు కావటి యాదగి రి, నాల్కపల్లి దావీదు, కడారి అంజనేయులు, సింగారపు నర్సింగరావు, సురుగు రమేశ్‌, కందుకూరి మల్లేష్‌, పసుల డానియేలు, పొదల దేవేందర్‌, కుర్ర సందీప్‌, కుర్ర సాయి  పాల్గొన్నారు.   

దేవరుప్పులలో..

దేవరుప్పుల : మండల కేంద్రంలోని జనగామ-సూర్యాపేట రహదారిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. రైతులు ఎడ్లబండ్లలో తరలివచ్చి రోడ్డుపై వంటావార్పు నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, ఎంపీపీ బస్వ సావిత్రి, వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ ఈదునూరి నర్సింహారెడ్డి, గ్రామ కోఆర్డినేటర్లు లీనారెడ్డి, పెద్దారెడ్డి, భిక్షపతి, కోతి పద్మ, నాయకులు వీరారెడ్డి దామోదర్‌ రెడ్డి, సుందరరాంరెడ్డి, మల్లేశ్‌, కొల్లూరు సోమయ్య, చింత రవి, కోతి ప్రవీణ్‌, రాంసింగ్‌, నర్సింహులు, సాయిలు, ఆంజనేయులు, అర్జున్‌, సంజీవరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కృష్ణమూర్తి, డైరెక్టర్లు మహేశ్‌, జోగేశ్వర్‌, సోమనర్సయ్య, పీఏసీస్‌ వైస్‌ చైర్మన్‌ నక్క రమేశ్‌, డైరెక్టర్లు జలేందర్‌రెడ్డి, సతీష్‌,ఆయా గ్రామాల సర్పంచ్‌లు రమాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, కూర్నాల రవి, అశోక్‌, రమేశ్‌, మధు, శంకర్‌, రాజన్న,  గేమానాయక్‌, ఎంపీటీసీ యాఖూ, ఆయా గ్రామశాఖల అధ్యక్షులు కాడబోయిన యాదగిరి, తీగల కొండయ్య, యాకస్వామి, సత్యనారాయణ,కిష్టయ్య,మేడ వెంకట్‌, హనుమంతు, యూత్‌ నాయకులు గడ్డం రాజు, నర్సింహస్వామి, గిరి, తిరుమలేశ్‌, చిరంజీవి, నాగరాజు, చంద్రమౌళి, నర్సయ్య, సత్యనారాయణ, రఫేల్‌రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు. అఖిలపక్ష పార్టీల నుంచి కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఉప్పల సురేశ్‌బాబు, నాయకులు  యాకయ్య, కృష్ణమూర్తి, ఎర్రయ్య, సోమనర్సయ్య, అంజయ్య, సీపీఎం నుంచి సింగారపు రమేశ్‌, మాధవరెడ్డి, భిక్షపతి, సీపీఐ నుంచి బిళ్ల తిరుపతిరెడ్డి, జీడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo