సోమవారం 01 మార్చి 2021
Jangaon - Dec 08, 2020 , 03:51:36

రహదారుల పక్కన మొక్కలు నాటాలి

రహదారుల పక్కన మొక్కలు నాటాలి

  •  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  •  అధికారులకు సూచనలు

నర్మెట, డిసెంబర్‌ 7 : రహదారుల పక్కన మొక్క లు నాటి సంరక్షించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని హన్మంతాపూర్‌ శివారు నుంచి తరిగొప్పుల మండల కేంద్రం వరకూ రోడ్డుకు ఇరువైపులా బౌండరీలను ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఆయన ఏర్పాటు చేయించారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా 40 ఫీట్ల వరకు మొక్కలు నాటించాలని అన్నారు. దీంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండడంతో పాటు వాతావరణంలో సమతుల్యం ఉంటుందన్నారు. ంఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, జడ్పీటీసీ మాలోత్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్‌, ఎంపీడీవో ఖాజా నయీమొద్దీన్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీశైలం, ఏపీవో రమాదేవి, సర్పంచ్‌లు బానోత్‌ శంకర్‌, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు గడపురం శశిరథ్‌, పండుగ మల్లేశం, బానోత్‌ రవి, గుగులోత్‌ కిషన్‌, రమేశ్‌, అంగోత్‌ సంజీవ, సీతారాం, ఎండీ హజ్జు  పాల్గొన్నారు. 

తరిగొప్పులలో 

తరిగొప్పుల(నర్మెట) : తరిగొప్పుల మండల మరియపురం గ్రామ శివారు నుంచి బొత్తలపర్రె శివారు జాలుబాయితండా వరకు రోడ్డుకు ఇరువైపులా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొక్కలు నాటేందుకు బౌండరీలను ఏర్పాటు చేశారు. ఆయన వెంట సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, తరిగొప్పుల సర్పంచ్‌ దామెర ప్రభుదాస్‌, ఏపీవో మల్లయ్య, నాయకులు జొన్నగోని సుదర్శన్‌గౌడ్‌, ఏపీవో లింగయ్య పాల్గొన్నారు. 

ఆక్రమణలను నిరోధించాలి

జనగామ రూరల్‌ : రోడ్లకు ఇరువైపులా పలుచోట్ల ఆక్రమణలు జరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో మొక్కలు నాటించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వడ్లకొండలో ఆర్‌ఆండ్‌ బీ రోడ్డును ఆయన పరిశీలించి కొలతలు వేయించారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా చదును చేసే పనులను ప్రారంభించారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ జనగామ-నర్మెట రోడ్డుకు ఇరువైపులా ఖాళీ భూమిలో ఉపాధిహామీలో మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నామన్నారు. చెట్లు పెరిగితేనే వానలు కురుస్తాయన్నారు. గతంలో కరువున్న జిల్లాలో నేడు నీటి ఊటలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల కలింగరాజు యాదవ్‌, ఆర్‌ అండ్‌ బీ డీఈ అశోక్‌ కుమార్‌, ఎంపీడీవో బిరుదు హిమబిందు, సర్పంచ్‌ బొల్లం శారదాస్వామి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బాల్దె సిద్ధిలింగం, మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్‌, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బూరెడ్డి ప్రమోద్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ బాల సిద్ధులు, మార్కెట్‌ డైరెక్టర్‌ నర్సింహులు,  సత్యనారాయణ, సర్పంచ్‌లు శ్రీనివాస్‌, జయరాం, కాల్‌రాం, బాలస్వామి, ఏపీవో భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ పాల్గొన్నారు.  


VIDEOS

logo