మంగళవారం 26 జనవరి 2021
Jangaon - Dec 05, 2020 , 02:19:03

గొర్రెలకు నట్టల నివారణ మందు వేయాలి

గొర్రెలకు నట్టల నివారణ మందు వేయాలి

జనగామ రూరల్‌, డిసెంబర్‌ 4 : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తప్పకుండా వేయించాలని మండల పశువైద్యుడు రాజశేఖర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సిద్దెంకి, గోపరాజుపల్లి గ్రామాల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెల కాపరులు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేవీవో హఫీజ్‌, ఎల్‌ఎస్‌ఏ శ్రీధర్‌, పశువైద్య సిబ్బంది అనిల్‌, నజీర్‌, గోపాల మిత్రలు, గొర్రెల పెంపకందారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 


logo